News November 14, 2024

స్పెషల్ ఫుడ్ కోసం పాండా ఏం చేసిందంటే?

image

ప్రత్యేక ఆహారంతో పాటు పరిరక్షణ, వసతి కోసం చైనాలోని ఆరేళ్ల జెయింట్ పాండా తాను గర్భం దాల్చినట్లు జూకీపర్లను నమ్మించింది. జూలో గర్భం దాల్చిన పాండాలకు 24 గంటల పాటు ప్రత్యేక చికిత్స లభిస్తుంది. అయితే, 2 నెలల పరిశీలన తర్వాత అది సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు తెలిపారు. కొన్ని తెలివైన పాండాలు ఇలా నటిస్తాయని అభిప్రాయపడ్డారు. హార్మోన్లలో మార్పుల వల్ల కూడా ఒక్కోసారి ఇలా జరగొచ్చని పేర్కొన్నారు.

Similar News

News December 9, 2024

రేపటి నుంచి సమ్మెలోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు

image

TG: తమను రెగ్యులర్ చేస్తామని CM రేవంత్ ఇచ్చిన హామీ నెరవేరలేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10నుంచి సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. 20ఏళ్లుగా తక్కువ జీతాలకు పని చేస్తున్నామని, పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమ్మెతో కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవిత సెంటర్లలో బోధన నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళనలో ఉన్నారు.

News December 9, 2024

నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

image

TG: ములుగు జిల్లా చల్పాక <<14757563>>ఎన్‌కౌంటర్‌<<>>కు నిరసనగా మావోయిస్టులు నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఆహారంలో విష ప్రయోగం చేసి కాల్చి చంపారని వారు ఆరోపించారు. మావోల బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విద్యాలయాలు, వ్యాపార సంస్థలు బంద్‌ను పాటించాలని మావోయిస్టులు కోరుతూ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.

News December 9, 2024

అందుబాటులోకి ‘మీ సేవ’ మొబైల్ యాప్‌

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మీ సేవ’ మొబైల్ యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందవచ్చు. కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. బిల్లుల చెల్లింపులు చేయవచ్చు. ఈ యాప్‌తో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే టీ ఫైబర్ నెట్ సేవలనూ ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అమలు చేయనుంది.