News March 28, 2024

నిర్మల ‘డబ్బుల్లేవ్’ వ్యాఖ్యలపై మీరేమంటారు?

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ‘నా దగ్గర ‘‘అంత డబ్బు’’ లేకపోవడం వల్లే ఎన్నికలకు దూరంగా ఉంటున్నా’ అని ఆమె చెప్పారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోటీ చేస్తున్న నేతలంతా తాను చెప్పిన ‘అంత డబ్బు’ ఖర్చు చేస్తున్నారా?, మరి డబ్బు లేని వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదనేదే తన ఉద్దేశమా అని అంటున్నారు. దీనిపై మీ కామెంట్? .

Similar News

News November 23, 2025

పంతం నెగ్గించుకున్న మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి

image

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగిత్యాల రూరల్ మండలం పొలసకు చెందిన గాజేంగి నందయ్య నియమితులయ్యారు. గత కొన్ని రోజులుగా అధిష్ఠానం మీద గుర్రుగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా గరం అవుతున్నారు. ఆయన ప్రధాన అనుచరుడైన నందయ్యను డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో, జీవన్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్లు అయింది.

News November 23, 2025

TODAY HEADLINES

image

* సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము
* డ్రగ్స్-టెర్రర్ లింక్‌‌ను నాశనం చేయాలి: మోదీ
* సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి
* అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ సాకారం కాలేదు: రేవంత్
* కొత్త లేబర్ కోడ్‌లు.. గొప్ప సంస్కరణల్లో ఒకటి: CBN
* TG పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల
* బెంగళూరులో ప్రైవేట్ ఈవెంట్‌లో ఒకే వేదికపై జగన్, కేటీఆర్

News November 23, 2025

ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదు: శ్రీధర్ బాబు

image

TG: ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం కేటీఆర్, <<18359759>>హరీశ్<<>> రావుకు అలవాటేనని మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. భూముల ధరలపై చేస్తున్న వ్యాఖ్యలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక ఉన్న రూ.లక్షల కోట్ల మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.