News March 28, 2024

నిర్మల ‘డబ్బుల్లేవ్’ వ్యాఖ్యలపై మీరేమంటారు?

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ‘నా దగ్గర ‘‘అంత డబ్బు’’ లేకపోవడం వల్లే ఎన్నికలకు దూరంగా ఉంటున్నా’ అని ఆమె చెప్పారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోటీ చేస్తున్న నేతలంతా తాను చెప్పిన ‘అంత డబ్బు’ ఖర్చు చేస్తున్నారా?, మరి డబ్బు లేని వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదనేదే తన ఉద్దేశమా అని అంటున్నారు. దీనిపై మీ కామెంట్? .

Similar News

News February 8, 2026

గందరగోళంలో ఉన్నారా? ఈ ప్రాచీన ట్రిక్ ట్రై చేయండి!

image

ఇతరుల సమస్యలకు గొప్ప సలహాలు ఇచ్చే మనం.. మన విషయంలో మాత్రం తడబడతాం. దీన్నే ‘సోలమన్ పారడాక్స్’ అంటారు. దీనికి చెక్ పెట్టేదే ‘ఇల్లీయిజం’. అంటే మీ గురించి మీరు ‘నేను’ అనకుండా మీ పేరుతో మాట్లాడుకోవడం. Ex ‘నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?’ అని కాకుండా ‘రాజు (మీ పేరు) ఈ సమస్యను ఎలా డీల్ చేయాలి?’ అని ఆలోచించడం. ఇలా చేస్తే ఎమోషన్స్ పక్కకు జరిగి తెలివైన నిర్ణయాలు తీసుకోవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.

News February 8, 2026

భారత్-అమెరికా డీల్: మన చమురుపై వారి పెత్తనమా?

image

రష్యా నుంచి చమురు కొనడం ఆపేయని పక్షంలో మళ్లీ 25% టారిఫ్‌లు విధిస్తామన్న US నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత చమురు కొనుగోలు నిర్ణయాలను అమెరికా శాసించడం ఏంటని కొందరు నిలదీస్తున్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. డీల్ సందర్భంగా ట్రంప్ ఏకపక్ష ప్రకటనలు, ఆయన వాడుతున్న అహంకారపూరిత భాషపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

News February 8, 2026

కిడ్నాప్ కేసులో నోటీసులు.. మంచు విష్ణు రిప్లై!

image

AP: తిరుపతిలోని MBUలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతల <<19041650>>కిడ్నాప్ కేసు<<>> కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తిరుచానూరు పోలీసులు మంచు విష్ణుకు (A-3) 5న నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో విచారణకు రావాలన్నారు. అయితే ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరవుతానని విష్ణు తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో వర్సిటీ PRO సతీశ్ (A-1) సహా పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. A-2గా ఉన్న మోహన్ బాబుకు ఇంకా నోటీసులు అందలేదు.