News April 27, 2024
రాహుల్ గురించి ‘అమేథీ’ ఏమనుకుంటోంది? – 2/2
రాహుల్ గాంధీ మరోసారి అమేథీలో పోటీ చేయడంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోందని ఓ సంస్థ సర్వేలో తేలింది. కొందరు రాహుల్ మరోసారి పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాహుల్ రీఎంట్రీపై ఆసక్తి చూపనట్లు సమాచారం. మూడు టర్మ్‌లలో రాహుల్ ఏమీ చేయలేదని కొందరంటే, సరైన నిర్ణయం తీసుకోలేని వారికి ఓటు వేయొద్దని మరికొందరు పేర్కొనడం గమనార్హం. <<-se>>#Elections2024<<>>
Similar News
News November 12, 2024
BIG ALERT.. రేపు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News November 12, 2024
ఆస్ట్రేలియాలో రహస్యంగా టీమ్ ఇండియా సాధన?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముంగిట ప్రాక్టీస్‌ను రహస్యంగా ఉంచాలని టీమ్ ఇండియా భావిస్తున్నట్లు ది వెస్ట్ ఆస్ట్రేలియన్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. IND ప్రాక్టీస్ చేస్తున్న పెర్త్‌కి ప్రేక్షకుల్ని రానివ్వడం లేదని పేర్కొంది. సిబ్బంది సైతం ఫోన్లను తీసుకెళ్లకుండా కఠిన నిబంధనల్ని భారత్ అనుసరిస్తోందని తెలిపింది. ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా కేవలం సిములేషన్‌తోనే సాధన చేస్తున్నట్లు వెల్లడించింది.
News November 12, 2024
తప్పకుండా చదవాల్సిన తెలుగు పుస్తకాలు!
పుస్తకాలు చదవడం వల్ల మనిషికి తన గురించీ, సమాజం గురించీ, ప్రకృతి గురించీ అవగాహన పెరుగుతుందంటారు. అయితే, ఏ పుస్తకాలు చదవాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారికోసమే ఓ నెటిజన్ పుస్తకాలు, వాటి రచయితకు సంబంధించిన జాబితాను షేర్ చేశారు. ఇందులో గురజాడ రాసిన కన్యాశుల్కం నుంచి మొదలై వందల పుస్తకాలున్నాయి. వీటిలో మీరెన్ని పుస్తకాలు చదివారు? ఏ పుస్తకమంటే ఇష్టమో కామెంట్ చేయండి. పుస్తక ప్రియులకు షేర్ చేయండి.