News November 29, 2024

రాజ్యసభ సీటు వార్తలపై నాగబాబు ఏమన్నారంటే?

image

AP: తనకు రాజ్యసభ సీటుపై Dy.cm పవన్ ఢిల్లీ పర్యటనలో <<14729358>>చర్చించారన్న<<>> వార్తలపై నాగబాబు స్పందించారు. ‘అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. సత్యం, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 29, 2024

కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారు: ఎర్రబెల్లి

image

TG: త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు.

News November 29, 2024

అదానీ, స్టాలిన్ సీక్రెట్ మీటింగ్.. Xలో రచ్చ

image

అదానీపై అమెరికా కోర్టులో అభియోగాల వివాదం తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తోంది. CM స్టాలిన్ కొన్నేళ్ల ముందు గౌతమ్ అదానీతో రహస్యంగా సమావేశమయ్యారన్న సమాచారం, వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. #AdaniStalinSecretMeet హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండ్ అవుతోంది. US ఛార్జిషీట్లో ఇండియా కూటమి పార్టీ పాలిస్తున్న TN పేరూ ఉంది. తమ ప్రతినిధులపై లంచం అభియోగాలు నమోదవ్వలేదని అదానీగ్రూప్ ఖండించడం తెలిసిందే.

News November 29, 2024

ఎకరాకు రూ.12 వేల బోనస్.. తృప్తిని ఇస్తోంది: సీఎం రేవంత్

image

TG: సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు ₹500 చొప్పున బోనస్ చెల్లిస్తోందని CM రేవంత్ తెలిపారు. ‘ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తోంది. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు ₹10వేల నుంచి ₹12వేల వరకు అదనపు ఆదాయం అందుతోంది’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘రైతన్నలకు ఎకరాకు ₹12 వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవ”సాయా”న్ని పండగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తిని ఇస్తోంది’ అని పేర్కొన్నారు.