News April 2, 2024

హార్దిక్ పాండ్యకు ఏమైంది?

image

ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్ పాండ్య ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. గుజరాత్ కెప్టెన్‌గా తొలి మూడు మ్యాచుల్లో విజయాన్ని అందుకున్న ఈ ఆల్‌రౌండర్.. MI కెప్టెన్‌గా మాత్రం విఫలమవుతున్నారు. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో హార్దిక్ ఫెయిల్ అవడం, ఆటగాళ్ల మధ్య సమన్వయం కల్పించడంలో విఫలమవ్వడం వంటివి ముంబై పరాజయాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు?

Similar News

News January 27, 2026

వీరు కాఫీ తాగితే ప్రమాదం

image

రోజూ తగినంత మోతాదులో కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. గర్భవతులు, బాలింతలు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ తాగినా 200 మిల్లీ లీటర్లు తాగాలని సూచిస్తున్నారు. అలాగే మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు, యాంగ్జైటీ సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News January 27, 2026

మొక్కుబడులు చెల్లించకపోతే చెడు జరుగుతుందా?

image

మొక్కుబడులు చెల్లించకపోతే దేవుడికి కోపం వస్తుందని అంతా భయపడతారు. కానీ తల్లికి బిడ్డల మీద కోపం రానట్లే దేవుడు కూడా మొక్కులు తీర్చలేదని కష్టాలు పెట్టడు. ఆయన మన నుంచి కేవలం ధర్మబద్ధమైన జీవనాన్నే కోరుకుంటాడు. మనం చేసే కర్మానుసారమే సుఖదుఃఖాలు కలుగుతాయి. మొక్కులు మరచిపోవడం అనేది మన బలహీనత. దేవుడు ఎప్పుడూ సత్యం, మాట మీద నిలబడమని చెబుతాడు. ఆ నియమాన్ని మీరితే అది మన సమస్యే అవుతుంది.

News January 27, 2026

కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఆశలు

image

AP: కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రం ఈసారి అనేక ఆశలు పెట్టుకుంది. అమరావతికి చట్టబద్ధత, పోలవరం పూర్తికి తగిన నిధులు అందించాలని ఇప్పటికే విన్నవించింది. రాజస్థాన్లో ₹40000CRతో నదుల అనుసంధానం చేపడుతున్నందున నల్లమలసాగర్‌కూ నిధులివ్వాలని కోరుతోంది. డేటా సెంటర్ వంటి సంస్థలతో ప్రాధాన్యం సంతరించుకున్న విశాఖ ఎకనమిక్ జోన్‌ అభివృద్ధికి ₹5వేల కోట్లు ఆశిస్తోంది. వివిధ మెగా ప్రాజెక్టులకూ నిధులపై ఆశాభావంతో ఉంది.