News October 20, 2024

ఆ ఏడాది OCT 5-14 తేదీలేమయ్యాయి?

image

తేదీలు మాయమవడం ఏంటని అనుకుంటున్నారా? గూగుల్‌లో 1582 నాటి క్యాలెండర్‌ను ఓ సారి చెక్ చేయండి. అక్టోబర్ నెలలో 5 నుంచి 14 వరకు తేదీలు కనపించవు. అప్పటివరకు సోలార్ క్యాలెండర్‌ను బేస్ చేసుకొని రూపొందించిన జూలియన్ క్యాలెండరే చాలా దేశాలు అనుసరించేవి. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్‌ అందుబాటులోకి రావడంతో 10 రోజులు ముందుకు వెళ్లాల్సి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ అదే క్యాలెండర్‌ను అనుసరిస్తున్నాం.

Similar News

News November 12, 2024

సజ్జల భార్గవ్ రెడ్డికి లుకౌట్ నోటీసులు

image

AP: YCP సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. పులివెందులలో నమోదైన అట్రాసిటీ కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మరోవైపు గుంటూరులో నమోదైన కేసులో భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.

News November 12, 2024

VIRAL: ఏపుగా కాదు.. అడ్డంగా పెరుగుతాయ్!

image

పైనున్న చెట్టుకేంటి ఒకవైపే కొమ్మలున్నాయి అనుకుంటున్నారా? ఇలాంటివి న్యూజిలాండ్‌లో కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి స్లోప్ పాయింట్ సమీపంలోని సౌత్ ఐలాండ్‌లో ఉంటాయి. దక్షిణ మహాసముద్రం నుంచి వచ్చే ఎడతెగని గాలుల వల్ల ఇలాంటి ఆకృతిలో చెట్లు పెరుగుతుంటాయి. ఈ గాలులు బలంగా, స్థిరంగా ఉండటంతో చెట్లు అడ్డంగా పెరిగినట్లు కనిపిస్తుంటుంది. కఠోరమైన పరిస్థితులనూ ప్రకృతి తనకు అనుకూలంగా మార్చుకుంటుందనడానికి ఇదొక ఉదాహరణ.

News November 12, 2024

EPF, EPS కాంట్రిబ్యూషన్ లిమిట్ పెంచితే ఉద్యోగికి నష్టమా?

image

EPF బేసిక్ పే లిమిట్ రూ.15K నుంచి రూ.21Kకు పెంచే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ లిమిట్ దాటినవాళ్ల ఎంప్లాయీ (12%), ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ (12%) EPFలోనే జమ అవుతున్నాయి. లిమిట్ లోపు ఉన్నవాళ్ల ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్‌లో 8.33% అంటే గరిష్ఠంగా రూ.1250 EPSకు వెళ్తుంది. లిమిట్ పెంచితే ఇది రూ.1749 వరకు పెరుగుతుంది. దీంతో EPF తగ్గి EPS కార్పస్ పెరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పింఛన్ లభిస్తుంది.