News November 9, 2024
కందిపప్పు తూకం తక్కువుందని పోస్టు పెడితే కేసా?: వైసీపీ
AP: వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై కేసుల నమోదుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పౌరసరఫరాల శాఖ ద్వారా సరఫరా చేసే కందిపప్పు కేజీకి బదులు 780 గ్రాములుందని పోస్టు పెట్టినందుకు 352(2) సెక్షన్ కింద వైసీపీ ప్రతినిధి బాబుల్‌రెడ్డిపై విచిత్ర కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వంలో కేసుకు కాదేదీ అనర్హం. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉంటుందా శాడిస్ట్ చంద్రబాబు?’ అని Xలో ప్రశ్నించింది.
Similar News
News December 11, 2024
చలికాలంలో రోగనిరోధక శక్తికి ఇవి తినండి!
చలికాలంలో దగ్గు, జలుబు, ఫ్లూ రాకుండా రోగనిరోధక శక్తి అవసరం. కొన్ని ఆహారాలు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి ఇవి దూరమవుతాయి. విటమిన్ C ఉండే ఆరెంజ్, లెమన్, నిమ్మను ఆహారంలో భాగం చేయాలి. అల్లం, వెల్లుల్లి తరచూ తీసుకోవాలి. ఈ సీజన్‌లో లభించే చిలగడదుంపలు తింటే బీటా కెరోటిన్ శరీరంలోకి చేరి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే బచ్చలకూర, కాలే వంటి ఆకుకూరలు తింటే వాటిలోని విటమిన్ A,C,Kలతో రోగనిరోధక శక్తి బూస్ట్ అవుతుంది.
News December 11, 2024
శ్రీలీలకు పెళ్లి చేసే బాధ్యత నాదే: సీనియర్ హీరో
అన్‌స్టాపబుల్ షోలో శ్రీలీలపై ప్రేమను సీనియర్ హీరో బాలకృష్ణ మరోసారి చాటుకున్నారు. ఈ బ్యూటీకి పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తనదేనని చెప్పారు. మంచి లక్షణాలు ఉన్న కుర్రాడిని వెతికిపెడతానని తెలిపారు. అంతకుముందు తాను పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని శ్రీలీల చెప్పిన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించారు.
News December 11, 2024
‘ప్రజావాణి’ కొనసాగుతుంది: భట్టి విక్రమార్క
TG: ఎన్ని ఇబ్బందులొచ్చినా ‘ప్రజావాణి’ కొనసాగుతుందని dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమస్యలతో వస్తున్న వారందరికీ పరిష్కారం చూపుతున్నామన్నారు. దరఖాస్తులన్నీ పరిశీలిస్తున్నామని, ప్రతి ఒక్కరి బాధను వింటూ పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చి, వారికి జవాబుదారీతనంగా ఉండటమే తమ లక్ష్యమని వివరించారు. ‘మీ కోసం మేము ఉన్నాం’ అనే భావనను అధికారులు ప్రజలకు కల్పించాలని ఆదేశించారు.