News August 28, 2024
‘రైట్ టు డిస్కనెక్ట్’ మన దగ్గరుంటే ఎలా ఉంటుంది?

ఆస్ట్రేలియాలో ఈ ‘రైట్ టు డిస్కనెక్ట్’ రూల్ అమల్లోకి వచ్చింది. యూరప్, అమెరికా వంటి 20కి పైగా దేశాల్లో ఇప్పటికే అమలులో ఉంది. దీని ప్రకారం ఆఫీస్ పని వేళలు ముగిశాక బాస్ నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. ఇది తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ఉపయోగపడుతుందని ఆ ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగులకు విశ్రాంతి ఇస్తే వారికి సిక్ లీవ్స్ అవసరమూ తగ్గుతుందని మరికొందరు అంటున్నారు.
Similar News
News July 10, 2025
అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు షేర్ చేస్తున్నారా?

బెంగళూరులో అనుమతి లేకుండా యువతి వీడియోను తీసి SMలో షేర్ చేసిన 26 ఏళ్ల యువకుడు అరెస్టయ్యాడు. యువతి ఫొటోలు, వీడియోలు అసభ్య కామెంట్లతో వైరలవ్వగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66E ప్రకారం ఇతరుల ఫొటోలను SMలో వారి అనుమతి లేకుండా షేర్ చేయడం నేరం. దీని ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
News July 10, 2025
రైతులు మీకు దొంగలు, రౌడీలుగా కనిపిస్తున్నారా?: జగన్

AP: మామిడి రైతులు సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కళ్లకు దొంగలు, రౌడీల్లాగా కనిపిస్తున్నారా? అని మాజీ CM జగన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవకపోగా వారిపై వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాబు పాలకుడు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. 76 వేల రైతు కుటుంబాల సమస్యను గాలికొదిలేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రైతులకు అండగా నిలబడండి’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
News July 10, 2025
ప్రేమ పెళ్లి.. వరుడికి 79, వధువుకు 75 ఏళ్లు

ప్రేమకు వయసుతో సంబంధం లేదని కేరళకు చెందిన ఓ వృద్ధ జంట నిరూపించింది. రామవర్మపురంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో 79 ఏళ్ల విజయ రాఘవన్, 75 ఏళ్ల సులోచన మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక్కటయ్యారు. వీరి వివాహానికి ఆ రాష్ట్ర మంత్రి ఆర్.బిందు, సిటీ మేయర్ వర్గీస్, అధికారులు హాజరయ్యారు.