News May 6, 2024

డిప్లమాటిక్ పాస్ పోర్టు అంటే ఏమిటి?

image

డిప్లమాటిక్ పాస్ పోర్టును ‘టైప్ డీ’ పాస్ పోర్టు అని కూడా అంటారు. దీనిని దౌత్యవేత్తలు, ప్రభుత్వం తరఫున అధికారిక ప్రయాణాలు చేసే వారికి జారీ చేస్తారు. ఈ పాస్ పోర్టు మెరూన్ కలర్‌లో ఉంటుంది. ఇది కలిగిన వ్యక్తులకు వీసా ప్రక్రియ, ప్రయాణం సులభతరం అవుతుంది. సెక్స్ వీడియోల కేసులో కీలక నిందితుడైన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈ పాస్ పోర్టుతోనే దేశం విడిచి జర్మనీ పారిపోయారు. ఎంపీగా ఉండటంతో ఆయన ఈ పాస్ పోర్ట్ పొందారు.

Similar News

News December 29, 2024

పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా?: హరీశ్ రావు

image

TGలో ఇటీవల పోలీసుల వరుస ఆత్మహత్య ఘటనలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. పోలీసుల మరణ మృదంగంపై ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. పలు అంశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వారిపై ప్రభావం చూపిస్తోందన్నారు. పోలీసులకు సూసైడ్ ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

News December 29, 2024

ICC అవార్డు.. నామినేట్ అయింది వీరే!

image

ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కోసం ఐసీసీ నలుగురిని నామినేట్ చేసింది. అందులో భారత్ నుంచి అర్ష్‌దీప్ సింగ్, ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్, పాకిస్థాన్ నుంచి బాబర్ ఆజమ్, జింబాబ్వే నుంచి సికందర్ రజాకు చోటు దక్కింది. ఈ నలుగురిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వస్తుంది. ఓటు వేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 29, 2024

కొత్త ఆఫర్: రూ.277తో రీఛార్జ్ చేస్తే..

image

న్యూ ఇయర్ సందర్భంగా BSNL కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.277తో రీఛార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 120GB హై-స్పీడ్ డేటా వస్తుంది. రోజుకు గరిష్ఠంగా 2GB వాడుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 60 రోజులు ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 16, 2025 వరకే అందుబాటులో ఉంటుందని BSNL తెలిపింది. అయితే సిగ్నల్ సరిగా రావట్లేదని, నెట్ చాలా స్లో ఉంటోందని కస్టమర్లు BSNLపై ఫిర్యాదులు చేస్తున్నారు.