News December 1, 2024
అదానీ తొలి సంపాదన ఎంతంటే…

తన జీవితంలో మొదటి సంపాదన రూ.10వేలని అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ‘1978లో నా 16 ఏళ్ల వయసులో అహ్మదాబాద్ వదిలేసి ముంబై చేరుకున్నాను. ఏం చేయాలో తెలీదు కానీ వ్యాపారి కావాలని మాత్రం నిశ్చయించుకున్నాను. మహీంద్రా బ్రదర్స్ అనే చోట చేరి జపాన్ వ్యాపారితో లావాదేవీ చేసి రూ.10వేలు సంపాదించాను. అదే తొలి సంపాదన. ఎప్పటికీ మరచిపోలేను’ అని వెల్లడించారు.
Similar News
News January 21, 2026
విజయ్-రష్మిక పెళ్లికి డచ్ గులాబీలు!

విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. విజయ్-రష్మికకు విషెస్ చెబుతూ వారి పెళ్లికి తమ తరఫున అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలు పంపనున్నట్లు చెప్పారు. ఈ ఫ్లవర్స్ వారి వేడుకను మరింత అందంగా మారుస్తాయని ఆకాంక్షించారు. ఇప్పటివరకు పెళ్లిపై రష్మిక, విజయ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
News January 21, 2026
భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు

TG: వనపర్తికి చెందిన ఆంజనేయులు, సరస్వతి (34) HYD బోరబండలో అద్దెకు ఉంటున్నారు. వీరికి 12ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కూతురు ఉన్నారు. భర్త ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమై గొడవలు జరిగేవి. అటు ఆంజనేయులు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్యను రోకలి బండతో కొట్టి చంపి పారిపోయాడు. ‘నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా నేనే చంపుకున్నా’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.
News January 21, 2026
‘మీ ఫోన్ కూడా ట్యాప్’?.. ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో హరీశ్ రావుకు సిట్ అధికారులు సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘2018 ఎన్నికల తర్వాత మీ ఫోన్, మీ కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని మీకు తెలుసా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో హరీశ్ షాక్‌కు గురై ‘ఇది మీరు సృష్టించారా?’ అని అడిగారని, పోలీసులు ట్యాప్ అయిన తేదీలు చెబుతూ ఆధారాలు చూపించారని వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.


