News December 30, 2024
శివలింగంతో అఖిలేశ్‌కు ప్రాబ్లమ్ ఏంటి: BJP
‘UP CM ఇంటి కింద శివలింగం ఉందని మా విశ్వాసం. అక్కడా తవ్వకాలు చేపట్టాలి. ఇది అభివృద్ధి కాదు వినాశనం’ అన్న SP చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై BJP విరుచుకుపడింది. ‘2013లో అఖిలేశ్ CMగా ఉండగా ప్రభుత్వం1000 టన్నుల బంగారం కోసం తవ్వకాలు చేపట్టింది. గోల్డ్ తవ్వకాలను ఇష్టపడే ఆయనకు శివలింగంతో ప్రాబ్లమ్ ఏంటి’ అని BJP నేత రాకేశ్ త్రిపాఠి అన్నారు. ఓటు బ్యాంకు కోసం శివలింగంపై SP రాజకీయాలు చేస్తోందని షెజాద్ విమర్శించారు.
Similar News
News January 24, 2025
వార్నీ.. సేమ్ జెండర్ వ్యక్తుల వందలాది పెళ్లిళ్లు
థాయ్‌లాండ్‌లో ఒకేసారి వందలాది మంది LGBTQ జంటలు వివాహం చేసుకున్నాయి. సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు చట్టబద్ధత కల్పించడంతో వారంతా వరుస కట్టి పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో ఆగ్నేయాసియాలో ఈ చట్టం కలిగిన తొలి దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. 18 కంటే ఎక్కువ వయసున్న వారెవరైనా లింగంతో సంబంధం లేకుండా పెళ్లిచేసుకోవాలని. అలాగే వైఫ్ & హస్బెండ్ అనే పదాలను కూడా ‘స్పౌస్’గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.
News January 24, 2025
12 వికెట్లు తీసిన జడేజా
రంజీల్లో ఓ వైపు భారత స్టార్ బ్యాటర్లు విఫలమవుతుండగా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ జడేజా అదరగొట్టారు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఏకంగా 12 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్సులో 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. బ్యాటుతోనూ రాణించి 38 పరుగులు చేశారు. ఈ మ్యాచులో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
News January 24, 2025
ICC టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్.. భారత్ నుంచి ముగ్గురు
టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024ను ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీమ్ ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. జట్టు: కమిన్స్, జైస్వాల్, బెన్ డకెట్, విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్, జడేజా, హెన్రీ, బుమ్రా.