News November 12, 2024
కలెక్టర్‌పై దాడి చేయడమేంటి?
జిల్లా అధికార యంత్రాంగానికి బాస్ కలెక్టర్. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అమలు చేసేది ఆయనే. నిన్న వికారాబాద్ జిల్లాలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బ్యూరోక్రాట్లపై దాడి చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే అధికారులు ఫీల్డులో ధైర్యంగా పని చేయలేరని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 14, 2024
అమరావతిలో మరో రూ.20వేల కోట్లతో అభివృద్ధి: నారాయణ
AP: అమరావతిలో మరో ₹20వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే E11, E13, E14 రోడ్లను మంత్రి పరిశీలించారు. అమరావతిలో ఇప్పటికే ₹21వేల కోట్ల పనులకు అనుమతి ఇచ్చామని, సోమవారం జరిగే CRDA అథారిటీ సమావేశంలో రూ.20వేల కోట్ల పనులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
News December 14, 2024
జీవో 317 సమస్యను పరిష్కరించండి: ఉపాధ్యాయులు
TG: జీవో 317 సమస్యను పరిష్కరించి తమను సొంత జిల్లాలకు పంపాలని బాధిత ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. స్థానికత ఆధారంగా తమను బదిలీ చేయాలని కోరారు. HYDలోని ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద పలువురు ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీవోను రద్దు చేయాలని విన్నవించారు.
News December 14, 2024
ఎంగేజ్మెంట్ చేసుకున్న సింధు(PHOTO)
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ED వెంకట దత్తసాయితో రింగ్స్ మార్చుకున్నారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అని ఓ కోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో పాటు కాబోయే భర్తతో కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. వీరి వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది.