News August 18, 2024

ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఏంటి?

image

ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే INA(ఇండియన్ నేషనల్ ఆర్మీ). 1942 Sep 1న భారత స్వాతంత్ర్య సమర యోధులు, జపాన్ కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తే దీని లక్ష్యం. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ కోసం పోరాడిందీ ఫౌజ్. 1943లో దీని బాధ్యతలు సుభాష్ చంద్రబోస్ అందుకున్నారు. 1945 May 13న ఫౌజ్ స్థావరంగా ఉన్న రంగూన్‌ను బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకోవడంతో కథ ముగిసింది.

Similar News

News January 22, 2025

సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోయారు: నిందితుడు

image

సైఫ్‌పై దాడి నిందితుడు షరీఫుల్‌తో పోలీసులు సీన్‌ రీక్రియేషన్ చేశారు. ‘అతడు ఇంట్లోకి ప్రవేశించేముందు షూ విప్పేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. కారిడార్‌లో సీసీ కెమెరా లేదని, సెక్యూరిటీ గార్డులు నిద్రపోతున్నట్లు చెప్పాడు. చోరీ చేసేందుకు సైఫ్ కొడుకు రూమ్‌లోకి ప్రవేశించగా పనిమనిషి తనను చూసి కేకలు వేసిందన్నాడు’ అని పోలీసులు తెలిపారు. తర్వాత సైఫ్ అతడిని పట్టుకునేందుకు చూడగా కత్తితో దాడి చేశాడని చెప్పారు.

News January 22, 2025

సైఫ్‌పై కత్తి దాడి: పోలీసు శాఖ ట్విస్ట్

image

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి కేసులో మరో ట్విస్ట్. మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్‌ పీఐ సుదర్శన్ గైక్వాడ్‌ను ఈ కేసు నుంచి తప్పించారు. ఆయన స్థానంలో అజయ్ లింగ్‌నూర్కర్‌ను నియమించారు. అధికారిని ఎందుకు మార్చారో పోలీసు పెద్దలు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో చాలా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని, పురోగతేమీ కనిపించడం లేదని కొందరు పెదవి విరుస్తున్నారు.

News January 22, 2025

APలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయండి: లోకేశ్

image

దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ ఛైర్ జాన్ డ్రూతో AP మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో WTCలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్‌ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్‌ను ప్రారంభించాలన్నారు. అటు దేశంలో 13 WTC సెంటర్లు పనిచేస్తున్నాయని, 7 నిర్మాణంలో ఉన్నాయని, ఏపీలో ఏర్పాటును పరిశీలిస్తామని జాన్ చెప్పారు.