News December 2, 2024

నేడే ‘సైబర్ మండే’.. అంటే ఏమిటి?

image

ఈకామర్స్ సైట్లలో ఇవాళ సైబర్ మండే సేల్ నడుస్తోంది. అమెరికాలో నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్ డే’ ఉంటుంది. ఆరోజు వ్యాపారులు భారీ ఆఫర్లు ఇస్తుంటారు. దీనికి పోటీగా ఆన్‌లైన్ షాపింగ్ పెంచేందుకు ఈ-రిటైలర్లు 2005లో ‘సైబర్ మండే’ ఆఫర్ సేల్ ప్రకటించారు. థ్యాంక్స్ గివింగ్ డే తర్వాతి సోమవారం ఇది ఉంటుంది (ఈసారి DEC 2). USA నుంచి ఇతర దేశాలకు పాకిన ఈ స్ట్రాటజీ ఇప్పుడు భారత్‌నూ తాకింది.

Similar News

News January 22, 2026

నెగటివిటీకి ఇలా దూరంగా ఉండాలి

image

మీరు ఏ విషయాలకు ఎక్కువగా నెగిటివ్​గా ట్రిగ్గర్ అవుతున్నారో గుర్తించండి. వాటికి దూరంగా ఉండండి. నిజాలు ఏంటో తెలుసుకోండి. అంతేకాని.. ఇలా అయి ఉండొచ్చని ఊహించుకుని సమస్యలను పెంచుకోకండి. క్లారిటీ లేనప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచిది. సమస్యలను చూసి భయపడడం కాకుండా.. దానిని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి. పరిస్థితులు ఎంత మిమ్మల్ని డౌన్ చేస్తున్నా.. మంచి జరుగుతుందని నమ్మాలి.

News January 22, 2026

IIT ఖరగ్‌పూర్‌లో ప్యాకేజీల వర్షం.. ఐదుగురికి ₹2 కోట్లకు పైగా ఆఫర్లు

image

IIT ఖరగ్‌పూర్‌ 2025-26 తొలివిడత ప్లేస్‌మెంట్లలో రికార్డు సృష్టించింది. మొత్తం 1,501 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించగా అందులో 457 ప్రీ-ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు ఉన్నాయి. ఐదుగురు స్వదేశీ కంపెనీల నుంచే ₹2 కోట్లకు పైగా ప్యాకేజ్ అందుకున్నారు. ఇందులో అత్యధికం ₹2.44 కోట్లు. మరో 10 మంది ₹కోటికి పైగా వార్షిక వేతనం దక్కించుకున్నారు. యాపిల్, గూగుల్ సహా పలు బడా కంపెనీలు రిక్రూట్ చేసుకున్న వాటిలో ఉన్నాయి.

News January 22, 2026

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

image

గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా దక్కించుకుంటానన్న <<18921246>>ట్రంప్<<>> సడన్‌గా రూట్ మార్చారు. ఫోర్స్ వాడనని ప్రకటించారు. ఆయన వెనక్కి తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఇవే అయి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1.అమెరికా గ్లోబల్ ఇమేజ్ పాడవుతుందన్న భయం. 2.ప్రపంచ దేశాలన్నీ ఏకమై వ్యతిరేకించడం. 3.సైనిక దాడి చేస్తే NATO, UN రూల్స్ బ్రేక్ అవుతాయి. 4.మిత్రదేశాల మధ్య గ్యాప్ వచ్చే రిస్క్ ఉండటం. 5.USలోనే సపోర్ట్ లేకపోవడం.