News September 26, 2024

రేపు ఏం జరగబోతోంది..

image

AP: జగన్ రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్నారు. రేపు సా.4 గం.కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. రాత్రి 7 గం.కు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. శనివారం ఉ.10.30 గం.కు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఏం జరగబోతోందనే టెన్షన్ నెలకొంది.

Similar News

News July 10, 2025

Grok4ను ఆవిష్కరించిన మస్క్

image

xAI ఆవిష్కరించిన AI చాట్‌బాట్‌లో అత్యాధునిక వెర్షన్ Grok4ను ఎలన్ మస్క్ ఆవిష్కరించారు. ఈ వెర్షన్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కంటే స్మార్ట్ అని, సబ్జెక్టులో పీహెచ్‌డీ‌ని మించి ఉంటుందని మస్క్ అన్నారు. దీంతో కొత్త సాంకేతికతలను అన్వేషించవచ్చని అంచనా వేశారు. ఈ వెర్షన్‌లో డెవలపర్స్ కోసం కోడింగ్ ఆటో కంప్లీషన్, డీబగ్గింగ్, IDE ఇంటిగ్రేషన్ ఉంటాయి. రియల్‌టైమ్ డేటా, మల్టీ మోడల్ సపోర్టింగ్ కూడా ఉంటుంది.

News July 10, 2025

నా ఫస్ట్ లవ్ అతడితోనే: అనుష్క శెట్టి

image

తాను ఆరో తరగతిలోనే సహ విద్యార్థితో ప్రేమలో పడిపోయినట్లు హీరోయిన్ అనుష్క శెట్టి తెలిపారు. తన ఫస్ట్ లవ్ విషయాన్ని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ రోజు నా క్లాస్‌మేట్ నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. నేను కూడా అతడికి ఓకే చెప్పా. అప్పుడు ఐ లవ్ యూ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ విషయం ఇప్పటికీ నాకు ఓ మధురానుభూతి’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అనుష్క నటించిన ‘ఘాటీ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

News July 10, 2025

ట్రంప్‌పై డ్రోన్‌ దాడి జరగొచ్చు: ఇరాన్ అధికారి

image

ట్రంప్‌పై ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి జావద్ లారిజనీ హెచ్చరించారు. సన్‌బాత్ చేసే సమయంలో డ్రోన్‌తో అటాక్ చేయొచ్చని బెదిరింపులకు పాల్పడ్డారు. ఫ్లోరిడాలోని నివాసం కూడా ట్రంప్‌కు సురక్షితం కాకపోవచ్చని చెప్పారు. 2020లో ఇరాన్ ఉన్నతాధికారి ఖాసీం సులేమాని హత్యలో ట్రంప్ పాత్రను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చీఫ్ ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నా ప్రతీకారం తప్పదన్నారు.