News November 9, 2024

‘హాట్’ యోగా అంటే?

image

ఒక గదిలో సాధారణం కంటే అధిక టెంపరేచర్‌ను మెయింటేన్ చేస్తూ చేసేదే ‘హాట్’ యోగా. దీనివల్ల కేలరీలు అధికంగా ఖర్చై బరువు తగ్గుతారని నమ్మకం. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని యోగా నిపుణులు చెబుతున్నారు. హాట్ యోగా వల్ల డీహైడ్రేషనై శరీరంలోని ఫ్లూయిడ్ అంతా ఆవిరైపోతుందని చెబుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో చర్మ సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. హాట్ యోగా చలి అధికంగా ఉండే దేశాల్లోని ప్రజల కోసమని పేర్కొన్నారు.

Similar News

News December 9, 2024

రష్యాకు రాజ్‌నాథ్ సింగ్: పుతిన్‌తో సమావేశం

image

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాకు చేరుకున్నారు. మాస్కోలో ఆయనకు మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్, భారత దౌత్యవేత్త వెంకటేశ్ కుమార్ స్వాగతం పలికారు. సైనిక సాంకేతిక సహకారంపై ఆయన రష్యా డిఫెన్స్ మినిస్టర్ ఆండ్రీ బెలూవోస్‌తో చర్చిస్తారు. ప్రెసిడెంట్ పుతిన్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమరులైనవారికి నివాళి అర్పిస్తారు. INS తుషిల్‌ను ఆరంభిస్తారు. ప్రవాస భారతీయులను కలుస్తారు.

News December 9, 2024

మంచు ఫ్యామిలీ వివాదం.. కీలక పరిణామం

image

మంచు ఫ్యామిలీలో <<14828101>>వివాదం నేపథ్యంలో<<>> ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. HYD జల్‌పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి అన్న మంచు విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వెళ్లారు. అక్కడి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ ఇంటి దగ్గర ప్రైవేట్ బౌన్సర్లను కాపలాగా పెట్టారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న మంచు విష్ణు కాసేపట్లో తమ్ముడి ఇంటికి వెళ్లనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News December 9, 2024

OTTలో అదరగొడుతోన్న ‘అమరన్’

image

శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. ఇండియా, సింగపూర్, శ్రీలంకలో నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. మొత్తంగా 14 దేశాల్లో టాప్-10 లిస్టులో కొనసాగుతోంది. మలేషియా, మాల్దీవ్స్, నైజీరియా, UAEలో రెండు, ఖతార్‌లో 3, పాకిస్థాన్‌లో 5, గ్లోబల్‌గా 10వ స్థానంలో స్ట్రీమింగ్ అవుతోంది. OCT 31న విడుదలైన ఈ చిత్రం రూ.320 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.