News December 12, 2024

జమిలి ఎన్నికలు అంటే ఏమిటి?

image

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌లో భాగంగా జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా జమిలి ఎన్నికల్లో భాగంగా దేశంలో MP, MLA ఎన్నికలు ఒకే దఫాలో నిర్వహిస్తారు. జమిలి ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. 1999లో జస్టిస్ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ జమిలి ఎన్నికలు జరపాలని సూచించింది. కానీ అప్పుడు వీలుపడలేదు. ప్రస్తుతం జమిలి ఎన్నికలు బెల్జియం, స్వీడన్, సౌతాఫ్రికా వంటి దేశాల్లో జరుగుతున్నాయి.

Similar News

News January 13, 2025

లాస్ ఏంజెలిస్ కార్చిచ్చు.. హాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు

image

లాస్ ఏంజెలిస్‌లో చెల‌రేగిన కార్చిచ్చును అదుపుచేసే క్రమంలో ఏర్పడిన నీటి కొర‌తకు హాలీవుడ్ న‌టులే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. విస్తార‌మైన వారి ఇంటి గార్డెన్ల నిర్వ‌హ‌ణ‌కు మోతాదుకు మించి నీటిని వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. గ‌తంలో ప‌రిమితికి మించి నీటిని వినియోగించార‌ని కిమ్ క‌ర్దాషియ‌న్‌కు ఫైన్ విధించారు. సిల్వ‌స్టెర్ స్టాలోన్‌, కెవిన్ హార్ట్ వంటి ప్ర‌ముఖులూ ఫైన్ చెల్లించిన వారిలో ఉన్నారు.

News January 13, 2025

పల్లెలు కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది: పవన్ కళ్యాణ్

image

AP: రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సంక్రాంతి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయని చెప్పారు. భారతీయులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి వేళ పల్లెలు పిల్లా పాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉందని తెలిపారు. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

News January 13, 2025

సంక్రాంతి కానుక.. ఇవాళే అకౌంట్లలోకి డబ్బులు

image

AP: ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.2వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనున్నట్లు AP NGO అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ వెల్లడించారు. పోలీసుల సరెండర్ లీవ్, ఉద్యోగుల GPF, మెడికల్ రీయింబర్స్‌మెంట్, FTA బిల్లులు సాయంత్రంలోపు అకౌంట్లలోకి జమ కానున్నాయని తెలిపారు. సర్వీస్ పోస్టేజ్, ఇంటర్నెట్ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, మైనర్ రిపేర్స్ బిల్లులూ త్వరలో విడుదలవుతాయన్నారు.