News December 17, 2024
JPC అంటే ఏంటి?

JPC(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) పార్లమెంటు ఉభయసభల ప్రతినిధులతో కూడినది. ఇది బిల్లు పరిశీలనతో పాటు సిఫార్సులు చేస్తుంది. వాటిని ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదు. కమిటీ పదవీకాలం లేదా విధి పూర్తైన తర్వాత రద్దవుతుంది. JPC సభ్యుల సంఖ్య ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. నేడు జమిలి బిల్లు లోక్సభ ఆమోదం పొందగా, JPCకి పంపేందుకు సిద్ధమని అమిత్ షా ప్రకటించారు. JPC సభ్యుల పేర్లపై సాయంత్రానికి క్లారిటీ రానుంది.
Similar News
News September 15, 2025
దూబే ఉంటే టీమ్ ఇండియాకు ఓటమి దూరం!

టీమ్ ఇండియా క్రికెటర్ శివమ్ దూబే అరుదైన రికార్డు నెలకొల్పారు. వరుసగా 31 టీ20 మ్యాచుల్లో ఓటమెరుగని క్రికెటర్గా నిలిచారు. ఆయన ఆడిన గత 31 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచులోనూ ఓడిపోలేదు. ఆసియా కప్లో భాగంగా పాక్తో నిన్న జరిగిన మ్యాచులోనూ ఈ పరంపర కొనసాగింది. 2020లో న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఈ జైత్రయాత్ర కొనసాగుతోంది. 31 మ్యాచుల్లో 25 గెలవగా నాలుగు టై అయ్యాయి. రెండింట్లో ఫలితం తేలలేదు.
News September 15, 2025
రేపు భారీ వర్షాలు

ఏపీలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
News September 15, 2025
రోడ్డు వేసి 50 ఏళ్లు.. అయినా చెక్కుచెదరలేదు!

ప్రస్తుతం రూ.వేల కోట్లతో నిర్మించిన రోడ్లు చిన్న వర్షానికే ధ్వంసమవుతున్నాయి. కానీ 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ రోడ్డు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. అదే మహారాష్ట్ర పుణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డు(JM రోడ్). దీనిని 1976లో ‘రెకాండో’ అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. అధిక నాణ్యత గల పదార్థాలు, సాంకేతికత వాడటంతో 10ఏళ్ల గ్యారెంటీ కూడా ఇచ్చింది. ఇంత నాణ్యమైన రోడ్డు నిర్మించిన ఆ సంస్థకు మరో కాంట్రాక్ట్ ఇవ్వలేదట.