News December 1, 2024
కిషన్‌రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధం?: CM రేవంత్

TG: కేంద్రమంత్రి <<14761412>>కిషన్‌రెడ్డికి<<>> తెలంగాణతో ఏం సంబంధం అని CM రేవంత్ ప్రశ్నించారు. ‘ఆయనకు ఈ రాష్ట్రం గురించి మాట్లాడేందుకు ఏం అర్హత ఉంది? గుజరాత్‌లో మద్యపాన నిషేదం ఉందని చెబుతున్నారు. బస్సు ఏర్పాటు చేస్తా అక్కడ ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూసి వద్దామా? BJP గడిచిన మూడు పర్యాయాల మేనిఫెస్టోలతో ముందుకు వస్తే మేము కూడా మా మేనిఫెస్టోలతో చర్చకు సిద్ధం’ అని రేవంత్ సవాల్ విసిరారు.
Similar News
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.
News February 12, 2026
ఓటు లైట్ తీసుకున్నారా?

TG: మున్సిపాలిటీ ఓటర్లు పోలింగ్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగటున 82% పోలింగ్ నమోదవ్వగా మున్సిపాలిటీల్లో 73శాతమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామీణ ఓటర్లే బాధ్యతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పలు చోట్ల వృద్ధులు, విదేశాల నుంచి వచ్చి మరి ఓటేసిన ఘటనలు ఉన్నా మరికొందరు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో చైతన్యంగా కనిపించలేదు.
News February 12, 2026
నేటి సామెత: కొబ్బరి చెట్లకు కుడితిమిత్తి

కొబ్బరి మొక్కకు వృథాగా పారబోసే కుడితిని నీరుగా పోసి పెంచితే, అది పెద్దయ్యాక మనకు ఎన్నో కాయలను అందించి ఆ రుణాన్ని తీర్చుకుంటుంది. చిన్నతనంలో మనం చేసిన చిన్న సహాయానికి లేదా పెట్టిన పెట్టుబడికి ఆ చెట్టు భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ ప్రతిఫలాన్ని మనకు తిరిగి అందిస్తుంది. అలాగే చిన్నప్పుడు పిల్లలకు మంచి సంస్కారం, విద్యను అందిస్తే వారు పెద్దయ్యాక తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటారని ఈ సామెత చెబుతుంది.


