News February 15, 2025
మీనాక్షి నటరాజన్ రాజకీయ ప్రస్థానమిదే

TG కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమితులైన <<15464666>>మీనాక్షి నటరాజన్<<>> 1999-2002 NSUI అధ్యక్షురాలిగా, 2002-2005 మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ చీఫ్గా పనిచేశారు. 2008లో AICC కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2009-2014 వరకు మాందసౌర్ MPగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడారు. 2022లో భూదానోద్యమానికి 75yrs పూర్తయిన సందర్భంగా TGలో పర్యటించారు. 2023 TG అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేశారు.
Similar News
News January 11, 2026
నిరసనల్లో పాల్గొంటే మరణ శిక్ష: ఇరాన్

నిరసనల్లో పాల్గొంటే దేవుడి శత్రువుగా భావిస్తామని ప్రజలను ఇరాన్ హెచ్చరించింది. దేశ చట్టాల ప్రకారం మరణశిక్ష అభియోగాలు తప్పవని అటార్నీ జనరల్ ఆజాద్ హెచ్చరించారు. అల్లర్లు చేసే వారికి సాయం చేసినా ఇదే శిక్ష తప్పదని చెప్పారు. ఇప్పటిదాకా 2,300 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నిరసనలను <<18818974>>తీవ్రం చేయాలని<<>> ఇరాన్ యువరాజు రెజా పహ్లావీ పిలుపునివ్వడం తెలిసిందే.
News January 11, 2026
WPL: ముంబై ఇండియన్స్ ఘన విజయం

WPLలో తన రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (74*), నాట్ స్కీవర్ బ్రంట్ (70) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ తడబడింది. 19 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయింది.
News January 11, 2026
నిఖత్ జరీన్కు గోల్డ్ మెడల్

గ్రేటర్ నోయిడాలో (UP) జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మహ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్స్ సాధించారు. 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్.. 2023 ప్రపంచ ఛాంపియన్ నితూ ఘాంగాస్ను ఓడించి తన మూడో నేషనల్ టైటిల్ను గెలుచుకున్నారు. మరోవైపు హుసాముద్దీన్ 60KGల విభాగంలో సచిన్ సివాచ్పై విజయం సాధించారు. 75KGల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ సైతం గోల్డ్ మెడల్ సాధించారు.


