News April 11, 2024
రంజాన్ అంటే ఏమిటి?

ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెలను అరబిక్‌లో రంజాన్ అంటారు. నెలవంక దర్శనంతో ఇది మొదలవుతుంది. 29-30 రోజులుండే ఈనెలను పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో ఖురాన్ పఠనానికి ప్రాధాన్యం ఇస్తారు. నెలంతా సూర్యోదయానికి ముందే నిద్రలేచి భోజనం ముగిస్తారు. దీనినే సుహుర్/సెహ్రి అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ముగిస్తారు. అప్పుడు చేసే విందునే ఇఫ్తార్/ఫితూర్ అంటారు. ఉపవాసాలను ముగించడాన్ని ఈద్ ఉల్ ఫితర్ అంటారు.
Similar News
News March 24, 2025
శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు

AP: విశాఖ చినముషిడివాడలోని శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో ఉన్న 9 శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆదేశించింది. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని, తొలగింపు ఖర్చును మఠం నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.
News March 24, 2025
TTDలో హిందూయేతర ఉద్యోగుల తొలగింపు: BR

AP: 2025-26కు గాను ₹5,258Crతో TTD వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. TTDలో పనిచేసే హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం చేసినట్లు తెలిపారు. జూపార్క్ నుంచి కపిల తీర్థం వరకు ప్రైవేట్ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకోసారి సుపథం దర్శనం కల్పిస్తామని, వృద్ధులు, వికలాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు.
News March 24, 2025
క్యాన్సర్ కేసులపై ప్రచారంలో నిజం లేదు: మంత్రి

AP: రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో 105 మందికి క్యాన్సర్ సోకినట్లు తేలిందని చెప్పారు. బ్రెస్ట్, సర్వైకల్, బ్లడ్, ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అనపర్తిని యూనిట్‌గా తీసుకొని ఇప్పటివరకు 1.19 లక్షల మందికి స్క్రీనింగ్ చేశామన్నారు.