News May 20, 2024

ఏమిటీ రత్న భండార్‌? అందులో ఏమున్నాయి?

image

పూరీ క్షేత్రం కిందిభాగంలో ఈ రత్న భాండాగారం ఉంటుంది. రాజులు, భక్తులు సమర్పించిన బంగారం, వజ్రాలు, వెండిని ఇక్కడ భద్రపరిచారు. 1978లో రూపొందించిన అంచనా ప్రకారం.. 12,831 భరీల బంగారం(ఒక భరీ-12 గ్రాములు), 22,153 భరీ వెండి ఆభరణాలు ఉన్నాయి. ఈ గదిని తెరవాలని 2018లో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తాళాలు కనపడలేదు. కొన్నాళ్లకు డూప్లికేట్ తాళాలు దొరికినా గదిని తెరవకపోవడంపై వివాదం కొనసాగుతోంది.

Similar News

News December 8, 2024

చైతూ భర్తగా రావడం నా అదృష్టం: శోభిత

image

నాగ చైతన్య సింప్లిసిటీ, మంచి మనసు తనను ఆకట్టుకున్నాయని భార్య శోభితా ధూళిపాళ వెల్లడించారు. అలాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతను హుందాగా, ప్రశాంతంగా ఉంటాడని, మర్యాదగా ప్రవర్తిస్తాడని పేర్కొన్నారు. ఎలాంటి ప్రేమ కోసమైతే ఎదురుచూశానో అది చైతూ నుంచి దక్కిందన్నారు. తనను జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపారు. ఈ ప్రేమ జంట ఈ నెల 4న పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే.

News December 8, 2024

రేవంత్ ఏడాది పాటు వారి కోసమే పనిచేశారు: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం వరకు అందరిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో 60% పైన ప్రజలు కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత లేదని కాంగ్రెస్ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. మూసీ వెనుక మూటల దోపిడీ ఉందని దుయ్యబట్టారు. రేవంత్ ఈ ఏడాది పాలనలో అదానీ, బావమరిది, బ్రదర్స్ కోసమే పనిచేశారని ఆరోపించారు.

News December 8, 2024

క్రికెట్ ఫ్యాన్స్‌కు SAD DAY

image

టీమ్ ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇవాళ బాధాకరమైన రోజుగా మిగిలింది. భారత జట్టు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పురుషుల జట్టు ఓటమి పాలైంది. AUSతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు పరాజయం చవిచూసింది. అండర్-19 ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో యువ భారత్ ఓటమి పాలైంది. దీంతో ఈరోజు SAD DAY అంటూ క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.