News November 27, 2024

అఖిల్‌కు కాబోయే భార్య వయసు ఎంతంటే?

image

అక్కినేని అఖిల్ (30) తన ప్రేయసి జైనబ్ రవ్‌డ్జీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ కంటే వయసులో జైనబ్ 9 ఏళ్లు పెద్ద అని పలు కథనాలు పేర్కొన్నాయి. మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకునే క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. అయితే జైనబ్ వయసు 27 ఏళ్లేనని మరి కొన్ని కథనాలు తెలిపాయి. ఏది ఏమైనా ప్రేమకు వయసు అడ్డు కాదని ఇద్దరి మనసులు కలవడం ముఖ్యమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News December 3, 2024

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు

image

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ వెంకటదత్త సాయితో ఆమె ఏడడుగులు నడవనున్నారు. ఈ నెల 22న వీరి వివాహం ఉదయ్‌పుర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. అనంతరం 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తారు. కాగా వరుడు సాయి కుటుంబానికి, సింధు ఫ్యామిలీకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. త్వరలో వీరి వివాహ పనులు ప్రారంభమవుతాయి.

News December 3, 2024

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున కాసేపు వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, మలక్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన పడింది. మరో వైపు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. చలి తీవ్రత బాగా తగ్గింది.

News December 3, 2024

రాజ్యసభ ఉప ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరేనా?

image

AP: రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. TDP తరఫున బీద మస్తాన్ రావు, సానా సతీశ్, BJP నుంచి ఆర్.కృష్ణయ్య బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనసేన ఒక సీటు ఆశించినా ఇప్పటికైతే ఆ ఛాన్స్ లేదని టాక్. నాగబాబుకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకు Dy.CM పవన్ హస్తినలో చక్రం తిప్పినా ఫలితం లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది.