News October 20, 2024
అధిక బరువుకు, ఊబకాయానికి తేడా ఏంటంటే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం అధిక బరువు ఉన్న వారందరూ ఊబకాయులు కాదు. ఎక్కువ కొవ్వు పేరుకుపోవడాన్ని అధిక బరువని, అనారోగ్యాన్ని కలుగజేసే స్థాయిలో కొవ్వు ఉండటాన్ని ఊబకాయంగా పిలుస్తారని నిపుణులు వివరిస్తున్నారు. దీన్ని బాడీ మాస్ ఇండెక్స్(BMI)లో కొలుస్తారు. ఇది 25.0 నుంచి 29.9 పాయింట్ల మధ్యలో ఉంటే అధిక బరువుగా, 30.0 పాయింట్లకు పైబడి ఉంటే ఓబేసిటీగా పరిగణిస్తారు.
Similar News
News November 14, 2024
అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి: KTR
TG: తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసని KTR ట్వీట్ చేశారు. ‘రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? 9నెలలుగా రైతులను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో’ అని ఆయన ట్వీట్ చేశారు.
News November 14, 2024
భారత్‌పై జాన్సెన్ అరుదైన రికార్డు
మూడో T20లో భారత బౌలర్లకు చుక్కలు చూపించిన మార్కో జాన్సెన్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. T20ల్లో INDపై అత్యంత వేగంగా(16 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో గ్రీన్(19 బంతులు), జాన్సన్ చార్లెస్(20), దసున్ శనక(20) ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌లో జాన్సెన్ 17 బంతుల్లోనే 54 రన్స్(4ఫోర్లు, 5సిక్సర్లు) చేశారు. హార్దిక్ వేసిన 19వ ఓవర్లో 26 రన్స్(4, 6, 4, 2, 6, 4) బాదారు.
News November 14, 2024
అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లను నామినేట్ చేసిన స్పీకర్
AP: అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లుగా పలువురు MLAలకు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అవకాశం కల్పించారు. వైసీపీ MLA దాసరి సుధ, జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలితకుమారి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులకు అవకాశం ఇస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.