News February 1, 2025

అసలు బడ్జెట్‌కు, GSTకి లింకేంటి?

image

Tax అనగానే SMలో Income Tax, GSTకి ముడిపెట్టి ఏదేదో మాట్లాడుతుంటారు. రూ.50లక్షల కారు కొంటే 28% GST, 20% GST Cess, మళ్లీ 30% IT అంటూ పోస్టులు పెడతారు. అన్నీ బడ్జెట్లోనే నిర్ణయించేస్తారని భావిస్తుంటారు. బడ్జెట్లో IT శ్లాబులు, పాలసీల గురించే ఉంటుంది. GSTతో లింకు ఉండదు. ఈ పన్ను రేట్లను ఆ కౌన్సిల్ ఏటా 3 సార్లు సమావేశమై నిర్ణయిస్తుంది. అంతా ఏకగ్రీవమే. ఒక్క రాష్ట్రం వ్యతిరేకించినా నిర్ణయం తీసుకోరు.

Similar News

News February 17, 2025

‘ఛావా’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

image

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ FEB 14న రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్ విడుదల నుంచే మూవీపై భారీ అంచనాలు ఏర్పడగా, అందుకు తగ్గట్లు నెట్‌ఫ్లిక్స్ పెద్ద మొత్తం చెల్లించి OTT రైట్స్ దక్కించుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యావరేజ్ టాక్ వస్తే నెలకే స్ట్రీమింగ్ చేయాలనుకోగా, పాజిటివ్ టాక్‌తో 8వారాల తర్వాతే OTTలోకి వచ్చే అవకాశముంది. బాలీవుడ్‌లో ‘ఛావా’కు రూ.31cr బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

News February 17, 2025

రేపు ఢిల్లీ సీఎం ప్రకటన? ఎల్లుండి ప్రమాణం?

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 8 రోజులు అవుతున్నా CM ఎవరనే దానిపై ఉత్కంఠ వీడటం లేదు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ భేటీలో CM, క్యాబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ CM రేసులో ఉన్నా, అశీష్ సూద్, రేఖా గుప్తా సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. రేపు ఎంపిక పూర్తైతే 18న ప్రమాణ స్వీకారం జరిగే ఛాన్సుంది.

News February 16, 2025

మీ ఫోన్‌లో రేడియోషన్ ఎంతో తెలుసుకోండి

image

మనం వాడే మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ విడుదలవుతుంది. అయితే మన ఫోన్ ఎంత రేడియోషన్ విడుదల చేస్తుందనేది తెలియకపోవచ్చు. దీనిని SAR(స్పెసిఫిక్ అబ్జార్‌ప్షన్ రేటు) ద్వారా నిర్ణయించవచ్చు. మీ ఫోన్ డయల్ పాడ్‌లో *#07# ను ఎంటర్ చేయడం ద్వారా ఈ SAR తెలుసుకోవచ్చు. మన దేశంలో మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే SAR లిమిట్ 1.6W/kg వరకు ఉంది.
ShareIt

error: Content is protected !!