News November 29, 2024
శిండే చూపులకు అర్థమేంటో?

మహారాష్ట్రలో సీఎం పదవి బీజేపీకి ఖాయం అయిందని వార్తలు వస్తున్నాయి. సీఎం పదవిపై బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఓకేనని ఏక్నాథ్ శిండే ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా నిన్న బీజేపీ అగ్రనేతలతో దేవేంద్ర ఫడణవీస్, శిండే చర్చించారు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫొటోలో అమిత్ షా పక్కన శిండే నిరాశగా చూస్తున్నట్టు కనిపించింది. దీంతో సీఎం పదవిని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేదా? అనే చర్చ మొదలైంది.
Similar News
News September 18, 2025
అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడు అరెస్ట్

IPL మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు, వ్యాపారవేత్త సమీర్ మోదీ ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఆయన్ను ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో సమీర్తో సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఒకరోజు జుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో సదరు మహిళ సమీర్ను రూ.50కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.
News September 18, 2025
జూబ్లీ బైపోల్.. ఢిల్లీలో పైరవీలు!

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం ఢిల్లీలో భారీ లాబీయింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీతో పాటు బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారు. హస్తిన నేతలతో పాటు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడిని కలిసి బీఫాం కోరారని తెలుస్తోంది. అటు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్తో ఖర్గే తనయుడు ఈ అంశంపై కాసేపటి క్రితం భేటీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖర్గేతో రేపు ఉదయం రేవంత్ సమావేశం కానున్నారు.
News September 18, 2025
నేను అన్ని మతాలను విశ్వసిస్తా: CJI గవాయ్

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ వస్తున్న విమర్శలపై CJI గవాయ్ స్పందించారు. ‘నేను అన్ని మతాలను విశ్వసిస్తా, గౌరవిస్తా. నా వ్యాఖ్యల్ని SMలో తప్పుగా చూపించారు’ అని అన్నారు. ఖజురహోలో ధ్వంసమైన విష్ణువు విగ్రహ పునర్నిర్మాణానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను ఇటీవల SC తిరస్కరించింది. ఈ సందర్భంగా ‘ASIని సంప్రదించండి లేదా ఏదైనా చేయమని దేవుడినే వేడుకోండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.