News November 29, 2024

శిండే చూపులకు అర్థమేంటో?

image

మహారాష్ట్రలో సీఎం పదవి బీజేపీకి ఖాయం అయిందని వార్తలు వస్తున్నాయి. సీఎం పదవిపై బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఓకేనని ఏక్‌నాథ్ శిండే ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా నిన్న బీజేపీ అగ్రనేతలతో దేవేంద్ర ఫడణవీస్, శిండే చర్చించారు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫొటోలో అమిత్ షా పక్కన శిండే నిరాశగా చూస్తున్నట్టు కనిపించింది. దీంతో సీఎం పదవిని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేదా? అనే చర్చ మొదలైంది.

Similar News

News December 6, 2024

పుష్ప-2.. తగ్గేదేలే

image

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా తొలి రోజు హిందీలో రూ.72కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో ఫస్ట్ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పోస్టర్ విడుదల చేసింది.

News December 6, 2024

పోలీస్ కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి ఇస్తూ కొడంగల్ కోర్టు తీర్పిచ్చింది. లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అధికారులపై దాడి ఘటనలో నరేందర్ ప్రమేయం ఉందని, ఆయనను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.

News December 6, 2024

RRRకు క్యాబినెట్ హోదా

image

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను కూటమి ప్రభుత్వం ఇటీవల శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా నియమించిన విషయం తెలిసిందే.