News September 23, 2024
మోదీకి శ్రీలంక కొత్త ప్రెసిడెంట్ ఏమని బదులిచ్చారంటే..
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి PM మోదీ నిబద్ధతను పంచుకుంటానని శ్రీలంక కొత్త ప్రెసిడెంట్ దిసనాయకే అన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. ‘మీ మంచి మాటలు, మద్దతుకు థాంక్స్. మన 2 దేశాల బంధం బలోపేతానికి కృషిచేస్తాను. మన ప్రజలు, మన ప్రాంత ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం’ అని పేర్కొన్నారు. భారత నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ, సాగర్ విజన్లో శ్రీలంకది ప్రత్యేక స్థానమని మోదీ ట్వీట్ చేశారు.
Similar News
News October 10, 2024
రతన్ టాటా విజయాలివే..
అనుభవలేమితో కెరీర్ ప్రారంభంలో రతన్ టాటా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. వాటినే సోపానాలుగా మలుచుకొని ఛైర్మన్ అయ్యాక తనదైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్‌ను విస్తరించారు. లండన్ టెట్లీ టీ కొనుగోలు, కార్ల తయారీ సంస్థలు జాగ్వార్, ల్యాండ్ రోవర్‌తో పాటు కోరస్ స్టీల్‌ను టాటాలో భాగం చేశారు. దీంతో పాటు ఐటీ, టెలి కమ్యూనికేషన్స్, ఆటో మొబైల్స్ రంగాల్లోనూ సంస్థను విస్తృతం చేసి సక్సెస్ అయ్యారు.
News October 10, 2024
రతన్ టాటా నేపథ్యమిదే..
రతన్ నావల్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు. నాయనమ్మ నవజ్‌బాయ్ పెంపకంలో ఆయన పెరిగారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. రతన్ ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. 1961లో టాటా స్టీల్‌లో ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1991-2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. తన నాయకత్వంలో టాటా గ్రూప్‌లో అనేక సంస్కరణలు చేపట్టారు.
News October 10, 2024
ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం: మహేశ్ ఫ్యాన్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంతోమంది పిల్లలకు గుండె సర్జరీలతో ప్రాణదానం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన సాయం రిత్విక అనే చిన్నారిని రక్షించిందంటూ APలోని కత్తులవారి పేటలో ఆయన ఫ్యాన్స్ పెట్టిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. ‘నువ్వు కాపాడిన 3772వ ప్రాణం సామీ. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు. మాకు నమ్మించే అక్కర లేదు. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’ అంటూ ఖలేజా డైలాగ్‌తో ఫ్లెక్సీ రూపొందించారు.