News May 10, 2024
దేశంలో శాకాహారుల శాతం ఎంతంటే?

దేశవ్యాప్తంగా 29 శాతం మంది శాకాహారులు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, రాష్ట్రాల వారిగా వీరి సంఖ్య భిన్నంగా ఉంది. దేశంలో అధికంగా రాజస్థాన్‌లో 75శాతం మంది శాకాహారులున్నారు. టాప్-5లో హర్యానాలో 70శాతం, పంజాబ్‌లో 67శాతం, గుజరాత్‌లో 61శాతం, హిమాచల్ ప్రదేశ్ 53శాతం ఉన్నాయి. లక్షద్వీప్‌లో ఒక్కరూ కూడా శాకాహారులు లేకపోవడం గమనార్హం. ఇక TGలో 1.3%, APలో 1.7% మంది మాత్రమే వెజిటేరియన్స్ ఉన్నారు.
Similar News
News February 9, 2025
మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడారు. అమిత్ షాను కలిసిన అనంతరం బీరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భళ్లాకు పంపారు. కాగా బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు నిన్న కాంగ్రెస్ ప్రకటించింది. ఈలోపే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.
News February 9, 2025
ఆగిన ఫ్లడ్ లైట్లు.. మ్యాచ్ నిలిపివేత

భారత్-ఇంగ్లండ్ రెండో వన్డేకు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ జోరు మీదున్న టైంలో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. వెలుతురు లేక అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ఇరు జట్ల ప్లేయర్లు మైదానాన్ని వీడారు. దీంతో ప్రేక్షకులు సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి సందడి చేస్తున్నారు.
News February 9, 2025
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు ఆదేశం

AP: తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్‌పై <<15400758>>ఆరోపణలు వస్తున్న<<>> వేళ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌ను ఆదేశించింది. జనసైనికులు, వీర మహిళలు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.