News May 11, 2024
మూడో విడత పోలింగ్ శాతం ఎంతంటే?

లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ వివరాలను ఈసీ అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 7న జరిగిన పోలింగ్‌లో 65.68శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. అత్యధికంగా అస్సాంలో 85.45%, అత్యల్పంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 55.75శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. కాగా ఎల్లుండి 96 లోక్‌సభ ఎంపీ స్థానాలకు నాలుగో విడత పోలింగ్ జరగనుంది. అంతకుముందు మొదటి విడతలో 66.14%, రెండో విడతలో 66.71% ఓటింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
Similar News
News December 19, 2025
గ్యాస్ గీజర్లు ప్రాణాంతకం.. ఎందుకంటే?

స్నానం చేసేటప్పుడు అకస్మాత్తుగా తల తిరగడం, స్పృహ తప్పడం సాధారణ విషయం కాదని, ఇది ‘గ్యాస్ గీజర్ సిండ్రోమ్’ కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గ్యాస్ గీజర్ల నుంచి విడుదలయ్యే రంగు, వాసన లేని కార్బన్ మోనాక్సైడ్(CO) ప్రాణాంతకంగా మారుతుంది. బాత్రూమ్లో సరైన వెంటిలేషన్ లేకపోతే ఈ విషవాయువు నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ గీజర్లను వాడటం మంచిది’ అని సూచిస్తున్నారు. SHARE IT
News December 19, 2025
కేంద్ర నూతన బడ్జెట్‌కు రాష్ట్ర ప్రతిపాదనలు

TG: నూతన బడ్జెట్లో రాష్ట్ర సమస్యలకు పరిష్కారం చూపేలా కేంద్రం ముందు పలు డిమాండ్లు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో సమర్పించేందుకు కొన్ని డిమాండ్లతో నివేదిక సిద్ధం చేసింది. GST సవరణతో ఏర్పడిన నిధుల లోటు భర్తీ, మెట్రో విస్తరణ, బయ్యారం స్టీల్ ప్లాంట్, డ్రైపోర్టు, బందర్ నుంచి అక్కడికి హైవే ఏర్పాటు, విభజన చట్టంలోని అంశాలను అందులో పొందుపరిచింది.
News December 19, 2025
18.38 లక్షల MGNREGA జాబ్ కార్డుల రద్దు

AP: ఉపాధి హామీ పథకం (MGNREGA) నుంచి FY25-26లో 18.38 లక్షల జాబ్ కార్డులు రద్దయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో లక్షకు లోపే ఉండగా ఏపీలోనే అత్యధిక కార్డులు తొలగింపయ్యాయి. OCT 10-NOV 14 మధ్య 5 వారాల్లోనే 11.07 లక్షల కార్డుల్ని తొలగించారు. ‘3 నెలలకోసారి సమీక్షించి వలసదారులు, మృతులు, పనులకు రానివారి పేర్లు తొలగిస్తుంటాం. చాలా మంది ఈ పని ఇష్టం లేక స్వచ్ఛందంగా పేర్లు తొలగించుకుంటున్నారు’ అని అధికారులు తెలిపారు.


