News May 11, 2024
మూడో విడత పోలింగ్ శాతం ఎంతంటే?

లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ వివరాలను ఈసీ అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 7న జరిగిన పోలింగ్‌లో 65.68శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. అత్యధికంగా అస్సాంలో 85.45%, అత్యల్పంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 55.75శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. కాగా ఎల్లుండి 96 లోక్‌సభ ఎంపీ స్థానాలకు నాలుగో విడత పోలింగ్ జరగనుంది. అంతకుముందు మొదటి విడతలో 66.14%, రెండో విడతలో 66.71% ఓటింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
Similar News
News February 18, 2025
అల్లు అర్జున్ సినిమాలో జాన్వీ కపూర్?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ చిత్రం దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్‌తోనే అని బన్నీఒక ప్రైవేట్ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ షెడ్యూల్ తదితర కారణాల రీత్యా పుష్ప-2 తర్వాత తన తదుపరి చిత్రం అట్లీతో చేయనున్నారట. ఈ మూవీపై పూర్తి అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయి.
News February 18, 2025
ఇన్ఫీ మా ట్రేడ్ సీక్రెట్లను దొంగిలించింది: కాగ్నిజెంట్

తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ TriZetto ట్రేడ్ సీక్రెట్లను దొంగిలిస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్టు కాగ్నిజెంట్ US కోర్టు ఫైలింగులో పేర్కొంది. తమ కంపెనీ, తమ CEO రవికుమార్ పోటీ విరుద్ధ చర్యలకు పాల్పడ్డారని, తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ Infosys Helix గ్రోత్‌ను తగ్గించేలా సమాచారాన్ని దుర్వినియోగం చేశారన్న ఇన్ఫీ కౌంటరుకు ఇలా స్పందించింది. ఈ 2 కంపెనీల మధ్య చాన్నాళ్లుగా పోచింగ్ కేస్ నడుస్తోంది.
News February 18, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పెరిగి రూ.79,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరగడంతో రూ.86,950లకు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది. వివాహ శుభకార్యాల వేళ రోజూ ధరలు పెరగడంతో పెళ్లిళ్లు చేసేవారు ఆందోళన పడుతున్నారు.