News February 23, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

బర్డ్ ఫ్లూతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. అయినా చికెన్ ధరల్లో పెద్దగా మార్పులు లేవు. కొన్నిచోట్ల KG ₹100-₹150 మధ్యే చికెన్ లభిస్తుండగా, చాలా ప్రాంతాల్లో ₹190 వరకూ పలుకుతోంది. HYDలో ₹170-190 ఉండగా, సూర్యాపేటలో ₹150, తుంగతుర్తిలో ₹170, WGలో రూ.180, VJAలో రూ.180, VZM, కడపలో రూ.150, అనంతపురంలో రూ.120, రామచంద్రాపురంలో రూ.200 వరకూ ఉంది. మరి మీరు చికెన్ తింటున్నారా? ధర ఎంత? కామెంట్ చేయండి.
Similar News
News March 19, 2025
బైడెన్ మా ప్రతిపాదనలు స్వీకరించలేదు: మస్క్

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపైకి చేరుకున్న నేపథ్యంలో స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోనే సునీత, విల్మోర్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు తాము చేసిన ప్రతిపాదనలను రాజకీయ కారణాలతో బైడెన్ స్వీకరించలేదని అన్నారు. ఆయన తమ సూచనలు తీసుకొని ఉంటే వ్యోమగాములు ముందుగానే భూమిపైకి వచ్చేవారన్నారు. గతేడాది స్పేస్ షిప్‌లో సమస్యలు రావడంతో సునీత, విల్మోర్ రాక ఆలస్యమైంది.
News March 19, 2025
విద్యార్థులకు షాక్.. ఫీజులు భారీగా పెంపు

TG: పాలిటెక్నిక్ కోర్సు గరిష్ఠంగా రూ.39వేలకు పెరిగింది. దశాబ్ద కాలం నుంచి ఫీజుల పెంపు లేదని కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా రూ.40వేల వరకు వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచే వర్తిస్తుందని పేర్కొంది. కాగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.14,900 చెల్లిస్తోంది. మరోవైపు నేటి నుంచి పాలిసెట్ <
News March 19, 2025
ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వీధుల్లో అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. ఆయనతో పాటు కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ కూడా ఉన్నారు. ఇండియా, న్యూజిలాండ్‌ను ఏకం చేయడంలో క్రికెట్‌ను మించినది లేదని క్రిస్టోఫర్ ట్వీట్ చేశారు.