News February 16, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

బర్డ్ ఫ్లూతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నా ధరల్లో పెద్దగా మార్పు లేదు. గత వారం కేజీ చికెన్ రూ.220-240 ఉండగా, ఇప్పుడు రూ.200-220 పలుకుతోంది. HYD, విశాఖలో స్కిన్ లెస్ కేజీ రూ.200, విజయవాడలో రూ.220, చిత్తూరులో రూ.160 ఉంది. వైరస్ సోకిన కోళ్లను తినొద్దని, సోకని కోడి మాంసాన్ని 70-100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీరు చికెన్ తింటున్నారా? ధర ఎంత? కామెంట్ చేయండి.
Similar News
News October 16, 2025
8th పే కమిషన్ సిఫార్సులు మరింత ఆలస్యం!

కేంద్ర ప్రభుత్వ 8th పే కమిషన్ సిఫార్సులు ఆలస్యం కావొచ్చు. కమిషన్‌ను కేంద్రం JANలో ప్రకటించినా విధివిధానాలు తేల్చలేదు. పదేళ్లకోసారి ఉద్యోగుల జీతాలు సవరించాలి. 7th పే కమిషన్ 2014లో ఏర్పాటు కాగా సిఫార్సులు 2016లో అమల్లోకొచ్చాయి. ప్రస్తుత కమిషన్ సిఫార్సులు 2026లో అమల్లోకి రావాలి. కానీ 2027లో కూడా అమలు కాకపోవచ్చని ‘కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్’ పేర్కొంది. ఫిట్మెంటు 1.8xగా ఉండొచ్చని అంచనా వేసింది.
News October 16, 2025
విశాఖలో ₹1,222 కోట్లతో లులు ప్రాజెక్టు

AP: విశాఖకు AI హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానుండడంతో ‘లులు’ తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రూ.1,222 కోట్లతో హార్బర్ పార్కు వద్ద 13.74 ఎకరాల్లో వచ్చే ఈ ప్రాజెక్టులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, ఫన్ టూర్ వంటివి ఉంటాయి. దీనికి ప్రభుత్వం పలు రాయితీలిస్తోంది. ఇటీవల క్యాబినెట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపినా ప్రభుత్వం సవరించిన నిబంధనలకు ఓకే చెప్పింది.
News October 16, 2025
‘టెస్ట్ 20’.. క్రికెట్లో సరికొత్త ఫార్మాట్

టెస్ట్, టీ20ల కలయికతో ‘టెస్ట్ 20’ అనే సరికొత్త ఫార్మాట్ రాబోతోంది. ఇందులో రెండు జట్లు 20 ఓవర్ల చొప్పున ఒకే రోజు 2 ఇన్నింగ్స్‌లు ఆడతాయి. టెస్టు మ్యాచ్‌లా 2సార్లు బ్యాటింగ్ చేయొచ్చు. 2026 JANలో ‘జూనియర్ టెస్ట్ 20 ఛాంపియన్షిప్’ తొలి సీజన్ నిర్వహించనున్నట్లు ఈ ఫార్మాట్ ఫౌండర్ గౌరవ్ బహిర్వాని తెలిపారు. దీనికి మాజీ ప్లేయర్స్ ఏబీ డివిలియర్స్, క్లైవ్ లాయిడ్, హెడెన్, హర్భజన్ సలహాదారులుగా ఉన్నారు.