News February 16, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

బర్డ్ ఫ్లూతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నా ధరల్లో పెద్దగా మార్పు లేదు. గత వారం కేజీ చికెన్ రూ.220-240 ఉండగా, ఇప్పుడు రూ.200-220 పలుకుతోంది. HYD, విశాఖలో స్కిన్ లెస్ కేజీ రూ.200, విజయవాడలో రూ.220, చిత్తూరులో రూ.160 ఉంది. వైరస్ సోకిన కోళ్లను తినొద్దని, సోకని కోడి మాంసాన్ని 70-100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీరు చికెన్ తింటున్నారా? ధర ఎంత? కామెంట్ చేయండి.
Similar News
News March 28, 2025
‘మ్యాడ్ స్క్వేర్’ రివ్యూ&రేటింగ్

లడ్డూ పెళ్లి క్యాన్సిల్ కావడంతో ముగ్గురు హీరోలు గోవా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేదే ‘మ్యాడ్ స్క్వేర్’. మ్యాడ్ కామెడీ హిట్ కావడంతో ఈ మూవీలోనూ డైరెక్టర్ కామెడీపైనే దృష్టిపెట్టాడు. ఫస్టాఫ్‌లో సాగదీత, కొన్నిచోట్ల బలవంతపు కామెడీ ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ అదిరిపోతుంది. నితిన్, శోభన్, రామ్, లడ్డూ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. స్వాతిరెడ్డి సాంగ్ హైలైట్.
రేటింగ్: 2.75/5
News March 28, 2025
ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు

260వ ర్యాంకు- దివి మురళి.. దివీస్ ($ 10B)
600- P పిచ్చిరెడ్డి.. MEIL ($5.8B)
625- PV కృష్ణారెడ్డి.. MEIL ($5.6B)
1122- ప్రతాప్ సి.రెడ్డి.. అపోలో హస్పిటల్స్ ($3.3B)
1122- PV రాంప్రసాదరెడ్డి.. అరబిందో ఫార్మా ($3.3B)
1198- B పార్థసారథిరెడ్డి.. హెటిరో ల్యాబ్స్ ($3.1B)
1624- K సతీశ్ రెడ్డి.. డాక్టర్ రెడ్డీస్ ($2.3B)
1796- M సత్యనారాయణరెడ్డి.. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ ($2.1B)
News March 28, 2025
రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్, లైసెన్స్ రద్దు: UP పోలీసులు

యూపీలో ముస్లింలకు అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై నమాజ్ చేయొద్దని తేల్చిచెప్పారు. అలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే వారి పాస్‌పోర్టును, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ‘ఈద్ ప్రార్థనల్ని మసీదులు లేదా ఈద్గాల్లోనే చేయాలి. రోడ్లపై చేసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.