News March 2, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడిప్పుడే బర్డ్ ఫ్లూ భయం నుంచి బయట పడుతున్నారు. కొన్ని రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో చికెన్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.180గా ఉంది. ఇతర జిల్లాల్లోనూ దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. అటు ఏపీలోని విజయవాడలో కేజీ రూ.210, కాకినాడలో రూ.150-170 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News March 23, 2025
ఉప్పల్‌లో IPL మ్యాచ్.. జాగ్రత్త బ్రో!

HYDలోని ఉప్పల్ వేదికగా ఇవాళ IPL జట్లు SRH, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. అయితే స్టేడియంలో ఆకతాయిల పని పట్టేందుకు ‘షీ టీమ్స్’ మఫ్టీలో మహిళల రక్షణను పర్యవేక్షిస్తున్నాయి. అమ్మాయిలను ఇబ్బంది పెడితే తాటతీసేలా చర్యలు ఉండనున్నాయి. మరోవైపు 2,700 మంది పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. IPL స్కోర్ అప్డేట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.
News March 23, 2025
క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

క్రెడిట్ కార్డుల వాడకం ఇటీవల ఎక్కువైంది. అయితే చెల్లింపుల ఊబిలో చిక్కుకున్నవారు కార్డు క్లోజ్ చేస్తుంటారు. అది మంచిది కాదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ‘క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడమనేది మన ఆర్థిక పరిస్థితి బాలేదనే విషయాన్ని సూచిస్తుంది. దాంతో సిబిల్ స్కోర్ తగ్గే అవకాశముంది. ఒకవేళ కార్డు నిలిపేయడం తప్పనిసరైతే మరో క్రెడిట్ కార్డు తీసుకున్నాక దీన్ని క్లోజ్ చేసుకోవడం బెటర్’ అని వివరిస్తున్నారు.
News March 23, 2025
ప్రాక్టీస్ ఫొటోలు షేర్ చేసిన SRH

ఈ సీజన్లో SRH తొలి మ్యాచ్ మరో మూడు గంటల్లో మొదలు కాబోతోంది. రాజస్థాన్‌పై గెలిచి హోంగ్రౌండ్ తొలి మ్యాచ్‌తోనే ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇవ్వాలని ప్లేయర్స్ కసరత్తు చేస్తున్నారు. టీమ్ ప్రాక్టీస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన SRH మేనేజ్మెంట్.. ప్రతి ఒక్కరిలో, ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆటగాళ్ల దృఢ సంకల్పం కన్పిస్తోందని కామెంట్ చేసింది. అటు స్టేడియానికి ఫ్యాన్స్ తాకిడి మొదలవగా ఉప్పల్ పరిసరాల్లో కోలాహలంగా ఉంది.