News March 23, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

బర్డ్ఫ్లూ భయాన్ని వీడి ప్రజలు ఇప్పుడిప్పుడే చికెన్ తినడం మళ్లీ మొదలుపెడుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలో కోడి మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి కేజీ చికెన్ రూ.170 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.160కి కూడా లభిస్తోంది. అయితే ఎండలు ముదరడంతో ఫారాల్లో కోళ్ల మరణాలు పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో సప్లై తగ్గి చికెన్ ధర పెరిగే ఛాన్స్ ఉంది.
Similar News
News November 17, 2025
శ్రీవారి సన్నిధిలో ఆంజనేయుడి ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయం సన్నిధిలో ఎత్తైన ప్రదేశంలో ‘శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయం’ కనిపిస్తుంది. బాల్యంలో హనుమంతుడు తన వాహనమైన ఒంటె కోసం తిరుగుతుండేవాడు. ఆ అల్లరిని కట్టడి చేయడానికి, తల్లి అంజనాదేవి ఆయనకు బేడీలు తగిలించి, తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా కుదురుగా ఉండమని నిలబెట్టిందట. అందుకే ఈ ఆలయం బేడీ ఆంజనేయస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వామి కట్టుబాటుకు ప్రతీక. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 17, 2025
సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1,785 పోస్టులు

సౌత్ ఈస్ట్రన్ రైల్వే 1,785 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.rrcser.co.in/
News November 17, 2025
సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు ₹5 లక్షల పరిహారం

TG: సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున పరిహారం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్, MIM MLA, మైనారిటీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధుల బృందాన్ని ప్రభుత్వం సౌదీకి పంపించనుంది. మృతుల భౌతిక కాయాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు జరిపించనుంది. బాధిత కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను CM ఆదేశించారు.


