News March 23, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

బర్డ్‌ఫ్లూ భయాన్ని వీడి ప్రజలు ఇప్పుడిప్పుడే చికెన్ తినడం మళ్లీ మొదలుపెడుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలో కోడి మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి కేజీ చికెన్ రూ.170 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.160కి కూడా లభిస్తోంది. అయితే ఎండలు ముదరడంతో ఫారాల్లో కోళ్ల మరణాలు పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో సప్లై తగ్గి చికెన్ ధర పెరిగే ఛాన్స్ ఉంది.
Similar News
News April 22, 2025
3 రోజులు భగభగ.. బయటకు వెళ్లొద్దు!

TG: నేటి నుంచి మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ 45 డిగ్రీలను టచ్ చేస్తుందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో 42-44 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 41-42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావొచ్చని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని సూచించారు.
News April 22, 2025
బుమ్రా, మంధాన అరుదైన ఘనత

క్రికెట్ బైబిల్‌గా పిలిచే ‘విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్-2025 ఎడిషన్’ ఇవాళ ప్రచురితమైంది. ఇందులో వరల్డ్ లీడింగ్ మెన్స్ క్రికెటర్‌గా భారత స్టార్ బౌలర్ బుమ్రా, ఉమెన్స్ క్రికెటర్‌గా బ్యాటర్ మంధాన నిలిచారు. ఒకేసారి ఇద్దరు భారత ఆటగాళ్లు ఇందులో చోటు దక్కించుకోవడం విశేషం. మరోవైపు వరల్డ్ లీడింగ్ T20 ప్లేయర్‌గా వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ నిలిచారు. గతేడాది ప్రదర్శన ఆధారంగా వీరిని ఎంపిక చేశారు.
News April 22, 2025
జూన్ 14న గద్దర్ అవార్డుల ప్రదానం: దిల్ రాజు

TG: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని TGFDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. HICC వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలుగుతో పాటు ఉర్దూ చిత్రాలను ఎంకరేజ్ చేస్తామన్నారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటలతో గద్దర్ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.