News August 13, 2024
హీరోయిన్‌కు లేని ప్రాబ్లం మీకేంటి?: హరీశ్ శంకర్

‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య ఏజ్ గ్యాప్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు వయస్సు, మిగతావి అన్నీ చూసుకోవాలి. ఇది సినిమా. హీరోకు స్క్రీన్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. సినిమాకు ఒప్పుకునే అమ్మాయి(హీరోయిన్)కే సమస్య లేనప్పుడు, మీకేంటి ప్రాబ్లం?’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Similar News
News July 8, 2025
ఎల్లుండి నుంచి 16 బోగీలతో కాచిగూడ వందేభారత్

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు బోగీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 7 ఛైర్‌కార్, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో 8 బోగీలు ఉండగా, ఈ నెల 10వ తేదీ నుంచి 14CC, 2 EC కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది. కాగా బుధవారం మినహా ప్రతిరోజూ ఈ రైలు ఉ.5.45కు కాచిగూడలో బయల్దేరి మ.2 గంటలకు యశ్వంత్‌పూర్, అలాగే మ.2.45కు అక్కడ బయల్దేరి రా.11 గంటలకు కాచిగూడ చేరుతుంది.
News July 8, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 8, 2025
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ఫ్రారంభమయ్యాయి. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నేపథ్యంలో ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. Sensex 16 పాయింట్ల లాభంతో 83,458 పాయింట్లు లాభపడగా, Nifty ఒక పాయింట్ నష్టంతో 25,459 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, NTPC, ఇండస్ ఇండ్, ICICI, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో, టైటాన్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.