News December 17, 2024
అల్లు అర్జున్ రిమాండ్‌కు కారణమిదే?
సంధ్య థియేటర్ ప్రీమియర్ షోకి సెలబ్రిటీలను రానివ్వొద్దని థియేటర్ యాజమాన్యాన్ని ముందే హెచ్చరించినట్లున్న లేఖ <<14898794>>వైరల్<<>> అవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం యాజమాన్యం, అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పోలీసుల తరఫు లాయర్ వాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మాత్రం ఈ కారణాన్ని తోసిపుచ్చుతూ అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
Similar News
News January 24, 2025
పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ‘వరం’
AP:2027లో జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు కేటాయించింది. 2071-72 ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లను పిలవగా, పుష్కరాల ప్రతిపాదనలతో వాటిని రద్దు చేసి కొత్త నిధులను కేంద్రం ఇచ్చింది.
News January 24, 2025
త్వరలో RTCలో నియామకాలు: మంత్రి
TGSRTCలో త్వరలో 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 3500 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కొత్త బస్సులు కొనలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని, మరో 600 బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని చెప్పారు. HYDలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.
News January 24, 2025
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల
AP: మైనార్టీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల అయ్యాయి. రూ.40.22కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్‌కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.