News October 8, 2024

పుష్ప-2కి ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ ఎంతంటే?

image

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కి ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత డిమాండ్ నెలకొంది. రజినీకాంత్ నుంచి అల్లు అర్జున్ వరకూ స్టార్ హీరోల మూవీల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పుష్ప’కు ఆయన రూ.3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకోగా, పుష్ప-2కి ఏకంగా రూ.7.2 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ డిసెంబరు 6న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్‌కు ఎడిటింగ్ పూర్తి చేసి లాక్ చేసినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.

Similar News

News December 3, 2025

మెదక్: 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో 2వ విడతలో నామినేషన్ల స్వీకరణ రాత్రి వరకు కొనసాగింది. జిల్లాలోని 8 మండలాల్లో 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు వచ్చాయి. చేగుంట-188, మనోహరాబాద్-131, మెదక్-134, నార్సింగి-65, నిజాంపేట్-102, రామాయంపేట-126, చిన్నశంకరంపేట 185, తుప్రాన్-76 చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఆలాగే 1,290 వార్డు స్థానాలకు 3,430 మంది నామినేషన్‌లు సమర్పించారు. నేటి నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

News December 3, 2025

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

విశాఖపట్నంలోని <>డ్రెడ్జింగ్ <<>>కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, రెసిడెంట్ మేనేజర్, Asst కంపెనీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, MCA, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నేటి నుంచి ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. dredge-india.com

News December 3, 2025

పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

image

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్​తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.