News April 25, 2024
రువాండా బిల్లు అంటే ఏమిటి? దీని ఉద్దేశమేంటి?(1/2)

బ్రిటన్లోకి ఏటా వేలాది మంది అక్రమ వలసదారులు ప్రవేశిస్తున్నారు. సముద్రాల్లో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ వందల మంది చనిపోతున్నారు. వలసలకు, మరణాలకు చెక్ పెట్టడానికి రువాండా ప్రణాళికను బ్రిటన్ సిద్ధం చేసింది. అయితే వలసదారులను తరలించగల సురక్షిత దేశంగా రువాండాను పరిగణించలేమని అక్కడి సుప్రీం 2023లో తీర్పు ఇచ్చింది. దీంతో మరింత పటిష్ఠంగా రూపొందించిన సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
Similar News
News December 24, 2025
MDK: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, అహింసా శాంతి మార్గాన్ని యేసు క్రీస్తు మానవ సమాజానికి చూపించారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో క్రిస్టియన్ మైనారిటీలకు దేశానికే ఆదర్శంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు.
News December 24, 2025
రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ రావు ధ్వజం

TG: వాదనలో విఫలమై, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు వ్యక్తిగత దూషణలు మాత్రమే ఉంటాయంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. రేవంత్ రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తోందని తెలిపారు. అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న ఆయనను ప్రజలు క్షమించరని, 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ ఫైర్ అయ్యారు.
News December 24, 2025
1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలు: తుమ్మల

TG: విపక్ష నేతల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాల్లో రైతులు యూరియా ఎక్కువ కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎరువులపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రమంతా యాప్ అమలు చేస్తామన్నారు. CM ఆదేశాలతో రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా 1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు.


