News April 25, 2024

రువాండా బిల్లు అంటే ఏమిటి? దీని ఉద్దేశమేంటి?(1/2)

image

బ్రిటన్‌లోకి ఏటా వేలాది మంది అక్రమ వలసదారులు ప్రవేశిస్తున్నారు. సముద్రాల్లో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ వందల మంది చనిపోతున్నారు. వలసలకు, మరణాలకు చెక్ పెట్టడానికి రువాండా ప్రణాళికను బ్రిటన్ సిద్ధం చేసింది. అయితే వలసదారులను తరలించగల సురక్షిత దేశంగా రువాండాను పరిగణించలేమని అక్కడి సుప్రీం 2023లో తీర్పు ఇచ్చింది. దీంతో మరింత పటిష్ఠంగా రూపొందించిన సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

Similar News

News January 18, 2025

రంజీ మ్యాచ్ ఆడనున్న రోహిత్‌శర్మ

image

ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. CT జట్టు ప్రకటన సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కొద్దిరోజుల క్రితం హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. జనవరి 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నారు. కాగా 2015లో చివరిసారి అతడు రంజీట్రోఫీలో ఆడారు.

News January 18, 2025

భారతీయుల ఆయుర్దాయం ఎంతంటే?

image

ప్రపంచంలోని వివిధ దేశాలను బట్టి ప్రజల సగటు జీవిత కాలం మారుతుంటుంది. హాంకాంగ్‌లో ఉండే ప్రజలు సగటున ఏకంగా 85 ఏళ్లు జీవిస్తారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ వెల్లడించింది. అత్యల్పంగా నైజీరియాలో 53 ఏళ్లు మాత్రమే జీవిస్తారని తెలిపింది. ఈ జాబితాలో మకావో(85), జపాన్(84), సౌత్ కొరియా(84), స్విట్జర్లాండ్(84), సింగపూర్(83), నార్వే(83), AUS(83), స్పెయిన్(83), ఇండియా(67), పాకిస్థాన్(66) ఉన్నాయి.

News January 18, 2025

ఆహారాన్ని పదే పదే వేడిచేస్తున్నారా?

image

అన్నంతో పాటు ఇతర ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గదిలో రైస్‌ను ఎక్కువ సేపు ఉంచడం వల్ల బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్ విడుదల చేస్తుంది. దీంతో పోషకాలు కోల్పోవడం, జీర్ణ సమస్యలు & ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే రైస్ వండిన గంటలోనే ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు వేడి చేయాలి’ అని సూచిస్తున్నారు.