News October 7, 2024
‘దేవర’ పది రోజుల కలెక్షన్లు ఎంతంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. దసరా సెలవులు కావడంతో కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి పది రోజుల్లో రూ.466 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ఈ శుక్రవారం కొత్త సినిమాలు విడుదల కానుండగా థియేటర్లు తగ్గే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.
Similar News
News November 13, 2024
KTR ఆదేశాలతోనే కలెక్టర్‌పై దాడి!.. రిమాండ్ రిపోర్టులో సంచలనం
TG: కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగినట్లు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర పన్నారు. సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. కొందరికి డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పారు. అధికారులను చంపినా పర్వాలేదని నరేందర్ రెడ్డి రైతులకు చెప్పారు’ అని రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు.
News November 13, 2024
WHATSAPP యూజర్లే టార్గెట్‌గా సైబర్ క్రిమినల్స్ కొత్త స్కామ్
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వేలాదిగా జంటలు పెళ్లిపీటలు ఎక్కనున్నాయి. ఇదే అదనుగా సైబర్ క్రిమినల్స్ పాత APK స్కామ్‌నే మళ్లీ కొత్తగా మొదలుపెట్టారు. తెలియని ఫోన్ నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు పెళ్లి ఇన్విటేషన్ పంపిస్తారు. అందులో APK ఫైల్ ఉంచుతారు. దాన్ని తెరవగానే మీ మొబైల్లో సీక్రెట్‌గా ఇన్‌స్టాలై బ్యాంకు, పర్సనల్ డేటాను దొంగిలిస్తుంది. దీని ఆధారంగా క్రిమినల్స్ మీ బ్యాంకులోని డబ్బును దోచుకుంటారు.
News November 13, 2024
బ్రదర్.. ఇకనైనా లేచి పాదాలకు పనిచెప్పు!
కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటే ప్రమాదకరమని తెలిసినా లేచి నడిచేందుకు కొందరు ఇష్టపడరు. ఇలా సుదీర్ఘంగా కూర్చొని పనిచేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 2 గంటల పాటు కుర్చీలో కూర్చోవడం సిగరెట్ తాగినంత హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే మధుమేహం, గుండె జబ్బులొస్తాయి. మెడ, వెనుక భాగంలో నొప్పి వస్తుంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పడిపోతుంది. SHARE IT