News August 15, 2024

మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం?: ఉపాసన

image

కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై <<13822185>>హత్యాచార<<>> ఘటనపై ఉసాసన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది. సమాజంలో అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం? దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక. ఎక్కువ మంది స్త్రీలను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావాలనే నా లక్ష్యం బలపడింది. వారికి భద్రత, గౌరవాన్ని అందించేందుకు కృషి చేద్దాం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 15, 2024

కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుంది: రేవంత్

image

TG: ఎన్నో ఇబ్బందుల మధ్య సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని తెలిపారు. గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుందన్నారు. మహాలక్ష్మీ పథకంలో ఇప్పటి వరకు మహిళలు 85 కోట్ల ప్రయాణాలు చేశారని వెల్లడించారు. మోదీ, KCR హయాంలో గ్యాస్ సిలిండర్ రేట్లు భారీగా పెరిగాయని విమర్శించారు.

News September 15, 2024

రిటైర్మెంట్‌పై స్టార్ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు

image

తన ఆటను మెరుగుపరుచుకోలేదని భావించినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ఆటకు వీడ్కోలు పలకడం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదని, దీంతో ఆటపై ప్రేమను కోల్పోదలుచుకోలేదన్నారు.

News September 15, 2024

స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు కొరత రాకుండా చూస్తాం: శ్రీనివాస వర్మ

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిన విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌కు ఇలాంటి సమస్య కొత్తగా వచ్చినది కాదని వ్యాఖ్యానించారు. బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరదలతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.