News September 23, 2024

మద్యం ధరలు తగ్గించి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు?: VSR

image

AP: కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘మెడిసిన్స్ లేదా విద్యా సంస్థల ఫీజులను తగ్గించకుండా, మద్యం ధరను(₹99/180ml) తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుంది. ప్రజారోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహం కలుగుతోంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 20, 2025

భారీగా పెరిగిన వెండి ధర!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరగ్గా గోల్డ్ రేట్స్‌ తటస్థంగా ఉన్నాయి. కేజీ సిల్వర్‌పై ఏకంగా రూ.5,000 పెరిగి జీవితకాల గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం KG వెండి రేటు రూ.2,26,000గా ఉంది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,34,180, 22క్యారెట్ల 10gmల గోల్డ్ రేటు రూ.1,23,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 20, 2025

స్పైస్‌జెట్ ప్యాసింజర్‌పై ఎయిర్ ఇండియా పైలట్ దాడి!

image

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (AIX) పైలట్ ఒకరు తనపై దాడి చేశారని స్పైస్‌జెట్ ప్యాసింజర్ అంకిత్ దేవాన్ ఆరోపించారు. క్యూ లైన్ దాటుకొని వెళ్లడాన్ని ప్రశ్నించడంతో ఆగ్రహించిన పైలట్ తన ముఖంపై రక్తం వచ్చేలా కొట్టాడని Xలో పోస్ట్ చేశాడు. గాయాలకు సంబంధించిన ఫొటోను కూడా జత చేశాడు. ఘటన సమయంలో పైలట్ విధుల్లో లేనప్పటికీ.. అతణ్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్లు AIX తెలిపింది.

News December 20, 2025

మలయాళ నటుడు శ్రీనివాసన్ మృతి

image

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్ శ్రీనివాసన్(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్నూరు జిల్లాలోని పట్టియంలో 1956లో జన్మించిన శ్రీనివాసన్ 48 ఏళ్ల సినీ కెరీర్‌లో కామెడీ పాత్రలతో అలరించారు. సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి ఆలోచింపజేశారు. శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.