News March 29, 2024

పృథ్వీ షాను డగౌట్‌లో కూర్చోబెట్టడం ఏంటీ?: టామ్ మూడీ

image

ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఓపెనర్ పృథ్వీషాను డగౌట్‌లో కూర్చోబెట్టడం ఏంటని ఆసీస్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రశ్నించారు. ‘పృథ్వీషా ఓ అద్భుత ఆటగాడు. అతడో డేంజరస్ క్రికెటర్. గత సీజన్‌లో అతడు రాణించకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన బెంచ్‌కే పరిమితం చేస్తారా? అతడు డగౌట్ నుంచే పరుగులు చేయలేడు కదా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా పృథ్వీ షా స్థానంలో తెలుగు కుర్రాడు రికీ భుయ్ జట్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 5, 2025

ఇలా అయితే థియేటర్లు ఖాళీ అవుతాయ్: సుప్రీం

image

మూవీ టికెట్‌తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం ఒక సినిమాకి ₹1,500 నుంచి ₹2,000కు ఖర్చవుతుంది. ధరలను నియంత్రించకపోతే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉంది’ అని కోర్టు పేర్కొంది. కర్ణాటకలో మూవీ టికెట్ ధరను రూ.200కు పరిమితం చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించగా ఈ విధంగా స్పందించింది.

News November 5, 2025

వరిని ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వరి పంట కోసిన తర్వాత పనల మీద గింజలు కొంత వరకు ఎండుతాయి. తూర్పారబట్టి శుభ్రపరచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమను 12-14%కు తగ్గించాలి. అయితే ధాన్యంలో తేమ ఒక్కసారిగా తగ్గకూడదు. క్రమక్రమంగా తగ్గాలి. దీని కోసం సాధారణమైన ఎండలో ధాన్యాన్ని పరిచి మధ్యమధ్యలో తిరగతిప్పాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరబెడితే గింజల్లో తేమ ఒక్కసారిగా తగ్గి గింజలపై పగుళ్లు వచ్చి.. ధాన్యం మిల్లింగ్ సమయంలో నూకలయ్యే అవకాశం ఎక్కువ.

News November 5, 2025

మిడ్ డే మీల్.. రేట్లు పెంపు

image

TG: స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి అందించే ధరలను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ.5.45ను రూ.6.19కి, ప్రాథమికోన్నత స్కూళ్లలో రూ.8.17 నుంచి రూ.9.29కి పెంచారు. 9,10వ తరగతుల విద్యార్థులకు రూ.10.67 నుంచి రూ.11.79కి పెంచారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో పీఎం పోషణ్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.