News March 29, 2024
పృథ్వీ షాను డగౌట్‌లో కూర్చోబెట్టడం ఏంటీ?: టామ్ మూడీ
ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఓపెనర్ పృథ్వీషాను డగౌట్‌లో కూర్చోబెట్టడం ఏంటని ఆసీస్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రశ్నించారు. ‘పృథ్వీషా ఓ అద్భుత ఆటగాడు. అతడో డేంజరస్ క్రికెటర్. గత సీజన్‌లో అతడు రాణించకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన బెంచ్‌కే పరిమితం చేస్తారా? అతడు డగౌట్ నుంచే పరుగులు చేయలేడు కదా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా పృథ్వీ షా స్థానంలో తెలుగు కుర్రాడు రికీ భుయ్ జట్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 13, 2025
నిజామాబాద్‌లో రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
TG: పండగ వేళ పసుపు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి పల్లె గంగారెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారని పేర్కొంది. కాగా తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో బీజేపీ హామీ ఇచ్చింది.
News January 13, 2025
కోహ్లీ రెస్టారెంట్: ఉడకబెట్టిన మొక్కజొన్న ధర ₹525
కోహ్లీ రెస్టారెంట్ చైన్ One8 Communeలో ధరలపై చర్చ నడుస్తోంది. ఉడకబెట్టిన ప్లేటు మొక్కజొన్న కంకులకు ₹525 ధర చెల్లించానని HYDకు చెందిన ఓ యువతి పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దీంతో కొందరు ఆమెకు మద్దతిస్తుంటే, ఇంకొందరు తప్పుబడుతున్నారు. బ్రాండ్ హోటల్స్‌లో ఉండే ఏంబియన్స్‌కు ఆ మాత్రం ధర ఉంటుందని ఒకరు, One8 కమ్యూనిటీ మొత్తానికీ చెల్లించారని మరొకరు కామెంట్ చేస్తున్నారు.
News January 13, 2025
భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో 381 టెక్నికల్ పోస్టులకు SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. FEB 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో పురుషులకు 350, మహిళలకు 29, విడోలకు 2 పోస్టులున్నాయి. పలు విభాగాల్లో బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. రెండు దశల పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పేస్కేల్ ₹56,100-₹1,77,500 ఉంటుంది. పూర్తి వివరాల కోసం <