News October 23, 2024

విదేశాల్లో పాస్‌పోర్టు కోల్పోతే ఏం చేయాలి?

image

విదేశాలు వెళ్లినప్పుడు పాస్‌పోర్టు కోల్పోతే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. అనంతరం సమీపంలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. ఎంబసీలో ప్రాసెస్ సమయంలో ఆ FIR ఓ సాక్ష్యంలా ఉపకరిస్తుంది. పోలీస్ రిపోర్టును కచ్చితంగా వెంట ఉంచుకోవాలి. కొత్త పాస్‌పోర్టు వచ్చేందుకు కనీసం వారం పడుతుంది. అప్పటి వరకూ ఆగడం ఇబ్బందైతే ఎంబసీ అధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్(EC) ఇస్తారు.

Similar News

News October 23, 2024

ప్రియాంకా గాంధీకి బెస్ట్ విషెస్: సీఎం రేవంత్

image

కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు ఇవాళ నామినేషన్ వేసిన ప్రియాంకా గాంధీకి సీఎం రేవంత్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ప్రియాంకా గాంధీకి మనస్ఫూర్తిగా విషెస్ చెబుతున్నాను. ఆమె తన శక్తిమంతమైన స్వరంతో ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో గట్టిగా వినిపిస్తారని నేను నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కేరళకు వెళ్లిన సంగతి తెలిసిందే.

News October 23, 2024

AQI స్కోర్: ఇండియాను బీట్ చేసిన పాక్

image

దాయాది పాకిస్థాన్ బ్యాడ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమున్న దేశంగా అవతరించింది. AQI 394తో లాహోర్ మన ఢిల్లీని బీట్ చేసింది. సాధారణంగా Air Quality Index 100 ఉంటేనే ఆరోగ్యానికి మంచిదికాదు. ఇక 150 అయితే భయంకర రోగాలు అటాక్ చేస్తాయి. అలాంటిది 394 అంటే ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. ఇక ఢిల్లీ, కిన్షాసా, ముంబై, మిలనో, ఉలన్ బాటర్, కరాచీ సిటీస్ లాహోర్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

News October 23, 2024

ఇండియా వెనక్కి తగ్గదు, ఓటమిని ఒప్పుకోదు: బ్రెట్‌ లీ

image

క్రికెట్‌లో టీమ్ ఇండియా శక్తిమంతమైనదని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డారు. ఓటమి ఒప్పుకొని వెనక్కి తగ్గే అలవాటు ఆ జట్టుకు లేదన్నారు. ‘భారత్ ఒకప్పటి లాంటి జట్టు కాదు. ఎప్పుడైనా, ఎలాంటి జట్టునైనా మట్టి కరిపించగలమని భారత్‌కు తెలుసు. AUSను ఓడించగలమని కూడా తెలుసు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో నిర్లక్ష్యంగా ఆడటం వల్ల ఓడింది. రెండో టెస్టులో కచ్చితంగా పుంజుకుంటుంది’ అని స్పష్టం చేశారు.