News October 23, 2024

విదేశాల్లో పాస్‌పోర్టు కోల్పోతే ఏం చేయాలి?

image

విదేశాలు వెళ్లినప్పుడు పాస్‌పోర్టు కోల్పోతే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. అనంతరం సమీపంలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. ఎంబసీలో ప్రాసెస్ సమయంలో ఆ FIR ఓ సాక్ష్యంలా ఉపకరిస్తుంది. పోలీస్ రిపోర్టును కచ్చితంగా వెంట ఉంచుకోవాలి. కొత్త పాస్‌పోర్టు వచ్చేందుకు కనీసం వారం పడుతుంది. అప్పటి వరకూ ఆగడం ఇబ్బందైతే ఎంబసీ అధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్(EC) ఇస్తారు.

Similar News

News November 10, 2024

చెత్త తెచ్చిన ఆదాయం రూ.650 కోట్లు

image

అక్టోబర్ 2 నుంచి 31 వరకు కేంద్రం చేపట్టిన ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం 4.Oకు మంచి స్పందన లభించింది. దేశవ్యాప్తంగా 5.97 లక్షల ప్రభుత్వ కార్యాలయాల్లోని చెత్తను తొలగించడం ద్వారా రూ.650 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్తగా 190 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2021-24 మధ్య చెత్త అమ్మకం ద్వారా రూ.2,364 కోట్ల ఆదాయం లభించింది.

News November 10, 2024

3,50,000 మంది పిల్లలకు పాలు.. ఈ తల్లికి సెల్యూట్

image

తల్లి పాలకు మించిన పౌష్టికాహారం ఏదీలేదు. కానీ చాలా మంది పిల్లలకు ఈ పాలు అందడం లేదు. వారికోసం USకు చెందిన అలీస్ ఓగ్లెట్రీ(36) పెద్ద మనసు చాటుకున్నారు. 2023 జులై నాటికి తన బ్రెస్ట్ మిల్క్‌ను 2,645L దానం చేసి గిన్నిస్ రికార్డును సాధించారు. గతంలోనూ 1,569L పాలను అందించారు. తాను 3,50,000 మంది పిల్లలకు సాయం చేసినట్లు ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు ఇద్దరు పిల్లలు. సరోగేట్ మదర్‌గానూ సేవ చేశారు.

News November 10, 2024

ఆస్ట్రేలియా బయల్దేరిన విరాట్ కోహ్లీ

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా బయల్దేరారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆయన వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోహ్లీతోపాటు రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి బీజీటీ ప్రారంభం కానుంది.